కాలనీ ప్రేమకథ | thongi thongi chudamaku chandamama film is released in the month of December | Sakshi
Sakshi News home page

కాలనీ ప్రేమకథ

Published Thu, Aug 31 2017 1:51 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

thongi thongi chudamaku chandamama film is released in the month of December

దిలీప్, శ్రావణి, రాజ్‌బాల, అపర్ణ, బేబీ అక్షర ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. ఆనంద్‌ కానుమోలు దర్శకత్వంలో ఏఎం రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ‘‘ఒక కాలనీలో జరిగే ప్రేమ కథ ఇది. ప్రేమకథా చిత్రాల్లో ఓ వినూత్న ప్రయత్నం అవుతుంది. తమ మధ్య ఉన్నది ఎలాంటి బంధమో తెలియని జంట చివరి వరకు ఒకరికి ఒకరు ఆ బంధాన్ని వ్యక్తీకరించుకోరు. క్లైమాక్స్‌లో ప్రేమను వ్యక్తపరచుకోవడం అనేది ఆసక్తికరం. త్వరలో రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. డిసెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సమర్పణ: గురు రాఘవేంద్ర చారిటబుల్‌ ట్రస్ట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement