Thongi Thongi Choodamaaku Chandamama
-
ప్రేమిస్తే విలువ తెలుస్తుంది
దిలీప్, శ్రావణి జంటగా ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. గురు రాఘవేంద్ర సమర్పణలో ఎ. మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్, ఆడియోను నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసి, ‘‘ఈ సినిమా మంచి హిట్ అయి చిత్రనిర్మాతకు పేరుతో పాటు డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు మోహన్ రెడ్డి. ‘‘ఇష్టమైనవి దక్కాలంటే ముందు మనం దాన్ని ప్రేమించాలి. అది దక్కిందా? లేదా? అనేది తర్వాత విషయం. కానీ ప్రేమిస్తే వాళ్ల విలువ మనకు తెలుస్తుందని చెప్పే చిత్రమిది’’ అన్నారు ఆనంద్ కానుమోలు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: వివేక్ రఫీ ఎస్కే. -
మహిళల గొప్పదనం చెప్పేలా...
దిలీప్, శ్రావణి జంటగా ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. గురు రాఘవేంద్ర సమర్పణలో ఎ. సునీత మోహన్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలకు చాలా సమస్యలుంటాయి. మాకు ఇబ్బంది కలిగిన సందర్భాల్లో నిర్మాత మోహన్ రెడ్డిగారు ముందుకు నడిపించారు. నేటి యువత ఆకర్షణ మోజులో పడి అసలైన ప్రేమను మర్చిపోతున్నారు. అలాంటి వారికి ప్రేమ గొప్పదనం తెలియజేసే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘యువతకు ఒక ప్రతినిధిగా ఈ చిత్రంలో కనిపిస్తా’’ అన్నారు దిలీప్. ‘‘మహిళల గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. ఈ నెలాఖరులో లేదా డిసెంబర్ మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అని మోహన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: వివేక్ రఫీ ఎస్కే. -
కాలనీ ప్రేమకథ
దిలీప్, శ్రావణి, రాజ్‌బాల, అపర్ణ, బేబీ అక్షర ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో ఏఎం రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ‘‘ఒక కాలనీలో జరిగే ప్రేమ కథ ఇది. ప్రేమకథా చిత్రాల్లో ఓ వినూత్న ప్రయత్నం అవుతుంది. తమ మధ్య ఉన్నది ఎలాంటి బంధమో తెలియని జంట చివరి వరకు ఒకరికి ఒకరు ఆ బంధాన్ని వ్యక్తీకరించుకోరు. క్లైమాక్స్‌లో ప్రేమను వ్యక్తపరచుకోవడం అనేది ఆసక్తికరం. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. డిసెంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సమర్పణ: గురు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్.