ప్రేమిస్తే విలువ తెలుస్తుంది | Tongi Tongi Chudamaku Chandamama Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తే విలువ తెలుస్తుంది

Dec 30 2020 12:21 AM | Updated on Dec 30 2020 12:32 AM

Tongi Tongi Chudamaku Chandamama Movie Trailer Launch - Sakshi

దిలీప్, శ్రావణి జంటగా ఆనంద్‌ కానుమోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. గురు రాఘవేంద్ర సమర్పణలో ఎ. మోహన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్, ఆడియోను నిర్మాత సి. కళ్యాణ్‌ విడుదల చేసి, ‘‘ఈ సినిమా మంచి హిట్‌ అయి చిత్రనిర్మాతకు పేరుతో పాటు డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు మోహన్‌ రెడ్డి. ‘‘ఇష్టమైనవి దక్కాలంటే ముందు మనం దాన్ని ప్రేమించాలి. అది దక్కిందా? లేదా? అనేది తర్వాత విషయం. కానీ ప్రేమిస్తే వాళ్ల విలువ మనకు తెలుస్తుందని చెప్పే చిత్రమిది’’ అన్నారు ఆనంద్‌ కానుమోలు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: వివేక్‌ రఫీ ఎస్కే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement