
దిలీప్, శ్రావణి జంటగా ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. గురు రాఘవేంద్ర సమర్పణలో ఎ. సునీత మోహన్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలకు చాలా సమస్యలుంటాయి. మాకు ఇబ్బంది కలిగిన సందర్భాల్లో నిర్మాత మోహన్ రెడ్డిగారు ముందుకు నడిపించారు. నేటి యువత ఆకర్షణ మోజులో పడి అసలైన ప్రేమను మర్చిపోతున్నారు. అలాంటి వారికి ప్రేమ గొప్పదనం తెలియజేసే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘యువతకు ఒక ప్రతినిధిగా ఈ చిత్రంలో కనిపిస్తా’’ అన్నారు దిలీప్. ‘‘మహిళల గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. ఈ నెలాఖరులో లేదా డిసెంబర్ మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అని మోహన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: వివేక్ రఫీ ఎస్కే.
Comments
Please login to add a commentAdd a comment