
గచ్చిబౌలి: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గచ్చిబౌలి స్టేడియానికి చెందిన క్రీడాకారులు దిలీప్, మహేశ్‌రెడ్డి, సీహెచ్ రాఘవి, రామకృష్ణ మెరుగైన ప్రదర్శనతో రాష్ట్రానికి పతకాలు అందించారు. గుంటూరులో జరిగిన సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీ అండర్–14 బాలుర 100మీ. పరుగులో దిలీప్ స్వర్ణాన్ని గెలుచుకోగా... అండర్–18 బాలుర కేటగిరీ 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో మహేశ్‌రెడ్డి రజతాన్ని, అండర్–20 బాలుర 4–100 మీటర్ల రిలేలో రామకృష్ణారెడ్డి రన్నరప్‌గా నిలిచి వెండి పతకాన్ని అందుకున్నారు.
అండర్–16 బాలికల 2000 మీ. పరుగులో రాఘవి రజతాన్ని సాధించింది. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం ఏఓ శ్రీనివాస్, కోచ్ శ్రీనివాసులు క్రీడాకారులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment