![Dileep’s Kammarasambhavam nears completion, Siddharth wraps up his portions - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/10/siddhartha.jpg.webp?itok=Hua28rwR)
సిద్ధార్థ్ తమిళ్ పయ్యన్ (అబ్బాయి). అయితే తెలుగు కూడా బాగా మాట్లాడతారు. ఈజీగా నేర్చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఈ తమిళ కుర్రాడు మలయాళం నేర్చుకునే పని మీద ఉన్నారు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘కమ్మార సంభవం’ అనే మలయాళ మూవీలో నటిస్తున్నారు సిద్ధార్థ్. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించిన సిద్ధూకి మలయాళంలో ఇది మొదటి సినిమా.
అందుకని చిత్రదర్శకుడు రితీష్ అంబాతి సిద్ధూ పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారట. కానీ, సిద్ధూ సొంత గొంతు వినిపించడానికి రెడీ అయి, మలయాళం నేర్చుకున్నారు. రితీష్ అంబాతి దర్శకత్వంలో దిలీప్, సిద్ధార్థ్, నమిత, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘సినిమాలో సిద్ధార్థ్ పోర్షన్ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. బాగా నటించారాయన. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు రితీష్.
Comments
Please login to add a commentAdd a comment