'పోలీసులు చెప్పారని ఇన్నాళ్లు నోరు విప్పలేదు' | Kerala Actress Who Was Abducted, Molested Speaks For First Time | Sakshi
Sakshi News home page

'పోలీసులు చెప్పారని ఇన్నాళ్లు నోరు విప్పలేదు'

Published Wed, Jun 28 2017 4:13 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

'పోలీసులు చెప్పారని ఇన్నాళ్లు నోరు విప్పలేదు' - Sakshi

'పోలీసులు చెప్పారని ఇన్నాళ్లు నోరు విప్పలేదు'

తిరువనంతపురం: లైంగిక వేధింపుల అనంతరం పొడిపొడిగా మాత్రమే స్పందించిన ప్రముఖ నటి, పలు తెలుగు చిత్రాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్న కేరళ నటి స్పందించారు. ఓ కేరళ నటుడు టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఎవరైతే కేరళ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి, ఆ నటి మంచి మిత్రులని, చాలా క్లోజ్‌గా ఉండేవారని, అందుకే స్నేహం ఎవరితో చేయాలనే విషయంలో ముందుగానే జాగ్రత్త పడాలని అన్నారు. దీంతో ఆ నటుడి మాటలు తనను చాలా ఇబ్బంది పెట్టాయంటూ సదరు నటి స్పందించారు.

గత ఫిబ్రవరి నెలలో కేరళలోని ప్రముఖ నటిపై ఆమె డ్రైవర్‌, మరో ఆరుగురు వ్యక్తులు కలిసి లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. త్రిశూర్‌ నుంచి కోచికి తిరిగొస్తున్న సమయంలో ఆమెను కిడ్నాప్‌ చేసి ఈ దురాఘతానికి పాల్పడగా అది పెద్ద దుమారం రేగింది. ఈ మధ్య ఈ కేసు విషయం కాస్త సర్దుమణిగి గుట్టు చప్పుడు కాకుండా విచారణ సాగుతోంది. అయితే, సోమవారం రాత్రి దిలీప్‌ అనే నటుడు ఈ విషయంపై ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా వ్యాఖ్యానించి మరోసారి ఆ విషయాన్ని తెరమీదకు తెచ్చారు. దీంతో ఇన్నాళ్లు ఈ వ్యవహారంపై స్పందించేందుకు దూరంగా ఉన్న ఆమె ఏమన్నారంటే..

'నాపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో గతంలో నా వద్ద డ్రైవర్‌గా పనిచేసి ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిగా ఉన్న పల్సర్‌ సునీ నేను మిత్రులం అని, స్నేహాన్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఓ నటుడు(దిలీప్‌) అన్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది నన్నెంతో బాధ పెట్టింది. ఇలా నాకు వ్యతిరేకంగా ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం అవసరం అయితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోను' అంటూ ఆమె హెచ్చరించారు. ఇప్పటి వరకు ఈ కేసులో తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తాను ఏం మాట్లాడినా కేసు దర్యాప్తు మీద ప్రభావం పడుతుందని సీనియర్‌ పోలీసు అధికారులు చెప్పడంతో తాను ఏ మాట్లాడకుండా ఉన్నానని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement