5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం: నిందితుడు అరెస్ట్ | Neighbour arrested for raping 5-year-old in Delhi | Sakshi

5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం: నిందితుడు అరెస్ట్

Oct 23 2013 8:42 AM | Updated on Sep 28 2018 4:15 PM

దేశ రాజధాని న్యూఢిల్లీలో బలస్వ డైరీ ప్రాంతంలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడు దిలీప్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఇక్కడ వెల్లడించారు.

దేశ రాజధాని న్యూఢిల్లీలో బలస్వ డైరీ ప్రాంతంలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడు దిలీప్ (22)ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు చిన్నారి ఇంటి ఎదురుగా నివసిస్తాడని, అయితే  సోమవారం సాయంత్రం దుకాణానికి వెళ్లిన చిన్నారిని బుజ్జగించి తాను పని చేసే చోటకు తీసుకువెళ్లాడు.

 

అనంతరం ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. అ చిన్నారి గట్టిగా ఏడవడంతో దిలీప్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఏడుపు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకుని నిందితుడిని అదుపులోకి  పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ చిన్నారిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement