ఐదేళ్ల బాలికపై అత్యాచారం | On the five-year-old girl raped | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల బాలికపై అత్యాచారం

Published Mon, Jan 4 2016 12:01 AM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM

ఐదేళ్ల బాలికపై అత్యాచారం - Sakshi

ఐదేళ్ల బాలికపై అత్యాచారం

బాపట్ల : కామంతో కళ్లు మూసుకుపోయిన యువకుడు వరుసకు కూతురైన ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘ టన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెరువుజమ్ములపాలెంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి బాలికను తల్లిదండ్రులు అమ్మమ్మ వద్ద వదలి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లారు. ఆ సమయంలో బాబాయి వరసయ్యే బొల్లపల్లి దిలీప్ బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

మనవరాలు కనిపించక పోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన అమ్మమ్మకు ముళ్ల పొదల వద్ద బాలిక ఏడుస్తూ కనిపించడంతో ఇంటికి తీసుకొచ్చింది. చిన్నారి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఒకటో తేదీన బాపట్ల ఏరియా హాస్పటల్‌కు తీసుకురావడంతో విషయం బయటపడింది. నడవలేని పరిస్థితిలో ఉన్న బాలికకు పరీక్షలు నిర్వహించి అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించడంతో ఆమె తల్లి దండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాపట్ల రూరల్ ఎస్‌ఐ చెన్నకేశవులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement