నటి కేసు; వీడియోల కోసం దర్యాప్తు | Kerala actress molestation case: 2 accused sent to judicial custody | Sakshi

నటి కేసు; వీడియోల కోసం దర్యాప్తు

Feb 24 2017 3:57 PM | Updated on Jul 23 2018 8:49 PM

నటి కేసు; వీడియోల కోసం దర్యాప్తు - Sakshi

నటి కేసు; వీడియోల కోసం దర్యాప్తు

మలయాళీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో కేరళ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

కోచి: మలయాళీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో కేరళ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోనే గాక దక్షిణాది సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కేసులో ఆధారాలను సేకరించడానికి శుక్రవారం పోలీసులు నిందితుడిని కోచిలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. నటిని కిడ్నాప్ చేసి కారులో బందీగా చేసి తీసుకెళ్లిన ప్రాంతాలకు వెళ్లారు. కిడ్నాప్ చేసిన సమయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, నిందితులు ఫొటోలు, వీడియోలు తీశారని బాధిత నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా వారికి 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో నటి కారు డ్రైవర్, మాజీ డ్రైవర్, ఇతరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో మలయాళీ సినీ పరిశ్రమకు చెందిన ఓ హీరో ప్రమేయముందని వార్తలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement