
గూగుల్ ఇంట్లో ఆయనదే హాట్ టాపిక్
ఇదేదో ఒక్క భారత్‌లోనే అనుకుంటే అదీ కాదు.. అటు అమెరికాలో, గల్ఫ్ దేశాల్లో కూడా దిలీప్ గురించి శోధించడం మొదలుపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17 షూటింగ్ వెళ్లి వస్తున్న ప్రముఖ నటిని కిడ్నాప్ చేయి కారులోనే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దిలీప్ కుట్ర ఉందనే పేరిట పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. గత నవంబర్‌లోనే పెళ్లి చేసుకున్న దిలీప్ జులై నాటికి జైలులో అడుగుపెట్టారని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాదు, ట్విట్టర్, ఫేస్‌బుక్‌వంటి పలు సామాజిక మాధ్యమాల్లో కూడా ఇప్పుడు ఈ విషయం తెగ ట్రెండింగ్ అవుతోంది.