
రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శేఖర్’. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ‘శేఖర్’ చిత్రంలోని ‘ప్రేమ గంటే మోగిందంట’ పాటను విడుదల చేశారు.
‘‘బొట్టు పెట్టి.. కాటుక ఎట్టి వచ్చిందమ్మా సిన్నది... బుగ్గ మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతున్నది..’’ అంటూ మొదలైన ఈ పాట ‘డండ డండ డండ లవ్‌గంట మోగిందంట... తొలి ప్రేమే పుట్టిందంట’ అంటూ సాగుతుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ పాడారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరకర్త. ‘‘ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జీవితా రాజశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment