ఫ్యాన్స్‌కు టెన్షన్‌.. పొరపాటున కల్కి టికెట్స్‌ బుక్‌ చేసుకున్నారు! | Prabhas Kalki 2898 AD Tickets Booking Issue In Hyderabad | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని సమస్య.. కల్కి టికెట్స్‌ బుక్ అయ్యాయి!

Published Sun, Jun 23 2024 9:55 PM | Last Updated on Sun, Jun 23 2024 10:00 PM

Prabhas Kalki 2898 AD Tickets Booking Issue In Hyderabad

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో టికెట్‌ బుకింగ్స్ ప్రారంభం క్రేజీ రికార్డ్ సృష్టించింది. టికెట్స్ అమ్మకాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధిగమించింది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండడంతో ఇండియాలోనూ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు బుకింగ్స్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే టికెట్స్ అమ్ముడుపోయాయి.

‍అయితే హైదరాబాద్‌లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రభాస్ కల్కి 2898 ఏడీకి బదులు.. రాజశేఖర్ నటించిన కల్కి మూవీ టికెట్స్ బుక్ అయినట్లు చూపించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆందోళనకు గురయ్యారు. టికెట్స్‌ బుక్ చేసుకోవాలన్న తొందరలో ఫ్యాన్స్‌ ఈ విషయాన్ని గమనించలేదు. టికెట్ లావాదేవి పూర్తయ్యాక చూస్తే కల్కి పోస్టర్‌ కనిపించడంతో అవాక్కయ్యారు. కాగా.. 2019లో ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ కాంబోలో కల్కి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే అలా టికెట్స్ బుక్ అయిన వారికి బుక్‌మై షో వివరణ ఇచ్చింది. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపింది. కల్కి టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ.. కల్కి 2898 ఏడీ టికెట్‌గానే భావించండి. సాంకేతిక లోపం వల్లే ఈ సమస్య వచ్చిందని వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. కల్కి 2898 ఏడీ ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.

స్పందించిన రాజశేఖర్

అయితే తన సినిమా కల్కి టికెట్స్ బుక్ కావడంపై హీరో రాజశేఖర్ స్పందించారు. ఈ విషయంలో తనకేలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ సందర్భంగా కల్కి 2898 ఏడీ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement