Hero Rajasekhar And Jeevitha Interesting Love Story - Sakshi
Sakshi News home page

Rajasekhar: జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసింది.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన రాజశేఖర్‌

Published Wed, Apr 5 2023 9:25 PM | Last Updated on Thu, Apr 6 2023 9:09 AM

Actors Rajasekhar, Jeevitha Love Story - Sakshi

రాజశేఖర్‌ విలన్‌లా ఉన్నాడు, నమ్మకు అని జీవితకు సలహా ఇచ్చాడని తెలిపాడు రాజశేఖర్‌. ఇంకా ఆయన మాట్లాడుతూ.. అయినా సరే పట్టువీడని జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి, ఆస్పత్రి

జీవిత అంటే రాజశేఖర్‌.. రాజశేఖర్‌ అంటే జీవిత.. వీరిద్దరినీ వేర్వేరుగా చూడలేం. అంతలా ముడిపడిపోయిన ఈ జంట టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్‌లో ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. వీరి ప్రేమకథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. సినిమాలోలాగే వీరి ప్రేమకథలో కూడా అనేక ట్విస్టులున్నాయి. అసలు పరిచయమే ఒక వింత అనుభవంతో జరిగింది. రాజశేఖర్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో జీవితతో ఓ సినిమా చేయాల్సింది.

అయితే హీరోయిన్‌ బాలేదు, మార్చేయండి అని చెప్పాడట. కట్‌ చేస్తే నిర్మాతలు రాజశేఖర్‌ స్థానంలో మరో హీరోను పెట్టి సినిమా చేశారు. అలా విచిత్ర సంఘటనతో మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారడంతో 1991లో పెళ్లి చేసుకున్నారు. వీరి కూతుర్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ సినీరంగంలో ప్రవేశించి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు.

తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమ లవ్‌స్టోరీని వెల్లడించారు. ఒకసారి రాజశేఖర్‌ నా వద్దకు వచ్చి మీరు నాపై ఆసక్తి చూపిస్తున్నారని అనిపిస్తోంది అని నేరుగా అడిగేశాడు. ఆయనలో ఆ ఫ్రాంక్‌నెస్‌ బాగా నచ్చిందని చెప్పింది జీవిత. అయితే రాజశేఖర్‌ను ఒప్పించేందుకు, ఆయనను పెళ్లి చేసుకునేందుకు చాలా కష్టపడిందట. ఈ విషయం తెలిసిన రాఘవేంద్రరావు.. రాజశేఖర్‌ విలన్‌లా ఉన్నాడు, నమ్మకు అని జీవితకు సలహా ఇచ్చాడని తెలిపాడు రాజశేఖర్‌.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. అయినా సరే పట్టువీడని జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి, ఆస్పత్రిలో చేర్పించి సేవలు చేసి మా అమ్మానాన్నలతో ఓకే చెప్పించింది అని తెలిపాడు. ఈ క్రమంలో జీవిత ఓ సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనలైంది. 

'రాజశేఖర్‌ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఫీలయ్యాను. ఆయనకు అప్పుడు అంబాసిడర్‌ కారు ఉండేది. ముందు సీట్లో ఆయన పక్కనే ఆ అమ్మాయి కూర్చుంది. నేనేమో వెనకాల కూర్చున్నాను. చాలా బాధేసింది, ఏడ్చేశాను' అని చెప్తూ ఎమోషనలైంది. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నాతోనే ఉంటానని తెగేసి చెప్పింది, ఆ ప్రేమే నచ్చిందన్నాడు రాజశేఖర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement