Huge OTT Offers To Hero Rajasekhar Sekhar Movie - Sakshi
Sakshi News home page

Rajasekhar Movie: శేఖర్‌ మూవీకి ఓటీటీ షాకింగ్‌ రేట్స్‌!

Dec 3 2021 6:48 PM | Updated on Dec 3 2021 8:11 PM

OTT Huge Offers To Hero Rajasekhar Sekhar Movie  - Sakshi

పెద్దగా మార్కెట్ లేని రాజశేఖర్ లాంటి హీరోల సినిమాకి ఓటీటీలు ఈ రేంజ్‌లో డీల్‌ కుదుర్చుకోవడం గమనార్హం.

కరోనా కారణంగా ఓటీటీలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు సొంతంగా సినిమాలను తెరకెక్కించి డైరెక్ట్ స్ట్రీమింగ్ ఇస్తుంటే మరికొన్ని సంస్థలు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సినిమాలను ఫ్యాన్సీ రేటుకు కొనేసుకుంటున్నాయి. దీంతో థియేటర్ లో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ స్ట్రీమింగ్ కు భారీ ధరలను కూడా ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అందుకే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీలో వచ్చేస్తున్నాయి.

చదవండి: పుష్ప ట్రైలర్‌ టీజ్‌ అవుట్‌, మామూలుగా లేదుగా..

థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. ఓటీటీలు మాత్రం ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేసి కొన్ని సినిమాలను ఎలాగైనా డైరెక్ట్ ఓటీటీ దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా బజ్ క్రియేట్ చేసిన యాంగ్రీమెన్ రాజశేఖర్ ‘శేఖర్’ సినిమాపై ఇప్పుడు ఓటీటీల చూపు పడింది. డైరెక్ట్ రిలీజ్ కోసం ఓటీటీలు శేఖర్ సినిమాకు 22 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఫ్యాన్సీ రెట్లను ఆఫర్ చేస్తున్నాయట. ఈ సినిమా డిజిటల్ ప్లస్ శాటిలైట్ కలిపి 20 కోట్లకు పైగానే పలుకుతుండటం ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. పెద్దగా మార్కెట్ లేని రాజశేఖర్ లాంటి హీరోల సినిమాకి ఓటీటీలు ఈ రేంజ్‌లో డీల్‌ కుదుర్చుకోవడం గమనార్హం.

చదవండి: రూ. 3 కోట్ల మోసం, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్‌ హీరో ఇతడే

దీనికి కారణం ఇప్పటికే విడుదలైన శేఖర్ గ్లింప్స్ ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేశాయనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. ఈ సినిమా జానర్ కూడా మరో కారణం కాగా.. ఇది ఆల్రెడీ హిట్టయిన మలయాళ మూవీ జోసెఫ్‌కు రీమేక్ కావడంతో ఓటీటీలు ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకునేందుకు భారీ స్థాయి ఆఫర్లు ఇస్తున్నారట. శేఖర్ రీమేక్ మూవీ అయినప్పటికీ మెయిన్ సోల్ మిస్ కాకుండా కథ-స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేయడంతో పాటు తెలుగు ఆడియన్స్ కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ రీమేక్‌కి జీవిత రాజశేఖర్ డైరెక్టర్ కాగా స్క్రీన్‌ప్లే కూడా ఆమెనే చూసుకుంటుంది. మరి ఓటీటీకి ఇచ్చేస్తారా లేక థియేటర్లలో వదులుతారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement