మాట్లాడుతున్న పొన్ రాధాకృష్ణన్
శఢటీ.నగర్: ఎస్వీ శేఖర్‌ను పట్టివ్వడమే తన పనా? అంటూ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లుపురంలో బీజేపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సమధర్మ రాష్ట్ర మహానాడు ఈనెల 27న జరగనుంది. ఇందుకోసం జానకీపురంలో మహానాడు పందిరి గుంజం నాటే కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ హాజరై ప్రారంభించారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు నేతలు ఇందులో పాల్గొంటారన్నారు.
కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే మంచి మార్పు జరుగుతుందని, రాష్ట్రానికి తగినన్ని జలాలు అందుతాయన్నారు. తర్వాత ఒక కార్యక్రమంలో మంత్రిని కొందరు విలేకరులు ఎస్వీ శేఖర్ మిమ్మల్ని కలిసి మాట్లాడారుగా? అని ప్రశ్నించారు. ‘తాను ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆయన తనకు నమస్కారం చేసి వెళ్లారని, ఆయనను తాను పట్టుకుని ఎలా పోలీసులకు అప్పగించగలనన్నారు. ఇదేనా నా పని? పోలీసులు మాత్రమే అతన్ని అరెస్టు చేయాలని బదులిచ్చారు.
నేతల ఖండన: ఎస్వీ శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు రాజకీయ పార్టీల నేతలు ఖండన తెలిపారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలలోను నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్వీ శేఖర్‌ను అరెస్టు చేయకుండా ఉండేందుకు అధికారంలో ఉండే అతని బంధువే కారణమని పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment