Radha Krishnan
-
ఎల్లుండే తెలంగాణ కేబినెట్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో.. ఈ నెల 4న మరికొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సోమవారం రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కావడాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ గురించి గవర్నర్‌కు రేవంత్ చెప్పారని, 4న అందుబాటులో ఉండాల్సిందిగా కోరారని తెలుస్తోంది. రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్‌గా, పుదుచ్చేరి ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సైతం వ్యవహరిస్తుండడంతో ఈ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోమారు పిలుపు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళ లేదా బుధవారం వారు హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోదముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటివరకు స్పష్టత రాని ఒకట్రెండు బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరిల పేర్లు దాదాపు ఖరారయ్యాయని, ప్రేంసాగర్‌రావు, వివేక్‌లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ దఫా నాలుగు బెర్తులు భర్తీ చేస్తారని, ముస్లిం మైనారీ్టల కోసం ఒక బెర్తు, ఎస్టీల కోసం మరో బెర్తును ఖాళీగా ఉంచవచ్చని తెలుస్తోంది. ఢిల్లీలో చర్చల అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టత రానుంది. నాలుగో వారంలో బడ్జెట్ భేటీ! సీఎం రేవంత్‌రెడ్డి సోమ వారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో దాదాపుగా రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. కాగా సీఎం పలు అంశాలను గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతోపాటు ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన పక్షంలో 23, 24 తేదీల్లో..ఒకవేళ 23న కేంద్రం బడ్జెట్ పెట్టినట్లైతే 24 లేదా 25 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని, ఇందుకు అనుగుణంగా అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ అవుతుందని సమాచారం. -
తెలంగాణ గవర్నర్‌గా రేపు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియామకమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్.. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ఉదయం 11:15 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్‌కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్‌ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ విడుదల చేసింది. -
గురువులకే గురువు ఆయన!
విద్యార్ధి ఎగిరే గాలిపటం అయితే దానికి ఆధారమైన దారం గురువు. అందుకే భారత సంస్కృతిలో తల్లి దండ్రుల తరువాత స్థానం గురువుకు ఇచ్చారు. అలాంటి గురువులను సత్కరించడానికి ప్రతి యేడాది మన దేశంలో సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ రోజు జరుపుకొవడానికి ప్రధాన కారకులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
శుభలేఖ+లు టీజర్ రిలీజ్
-
ఎస్వీ శేఖర్‌ను పట్టివ్వడమేనా నా పని?
శఢటీ.నగర్: ఎస్వీ శేఖర్‌ను పట్టివ్వడమే తన పనా? అంటూ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లుపురంలో బీజేపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సమధర్మ రాష్ట్ర మహానాడు ఈనెల 27న జరగనుంది. ఇందుకోసం జానకీపురంలో మహానాడు పందిరి గుంజం నాటే కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ హాజరై ప్రారంభించారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు నేతలు ఇందులో పాల్గొంటారన్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే మంచి మార్పు జరుగుతుందని, రాష్ట్రానికి తగినన్ని జలాలు అందుతాయన్నారు. తర్వాత ఒక కార్యక్రమంలో మంత్రిని కొందరు విలేకరులు ఎస్వీ శేఖర్ మిమ్మల్ని కలిసి మాట్లాడారుగా? అని ప్రశ్నించారు. ‘తాను ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆయన తనకు నమస్కారం చేసి వెళ్లారని, ఆయనను తాను పట్టుకుని ఎలా పోలీసులకు అప్పగించగలనన్నారు. ఇదేనా నా పని? పోలీసులు మాత్రమే అతన్ని అరెస్టు చేయాలని బదులిచ్చారు. నేతల ఖండన: ఎస్వీ శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు రాజకీయ పార్టీల నేతలు ఖండన తెలిపారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలలోను నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్వీ శేఖర్‌ను అరెస్టు చేయకుండా ఉండేందుకు అధికారంలో ఉండే అతని బంధువే కారణమని పేర్కొనడం గమనార్హం. -
ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్
► కేబినెట్ ఆమోదించగానే రాష్ట్రపతి ఉత్తర్వులు ► ఇక్కడే కొనసాగనున్న ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ ► ఏపీకి హైకోర్టు ఏర్పాటయ్యాక సీజేగా వెళ్లే అవకాశం ► సుప్రీం న్యాయమూర్తులుగా జస్టిస్ జోసెఫ్, ఇందు మల్హోత్రా? సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టతిల్ బి.నాయర్ రాధాకృష్ణన్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. ఆయన ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై పలు నియామకాలకు ఆమోదముద్ర వేసింది. సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులతో పాటు పలు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాలను ఆమోదిస్తూ కేంద్రానికి సిఫార్సులు చేసింది. వీటిలో భాగంగా ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. కేంద్రం ఆమోదముద్ర అనంతరం కొలీజియం సిఫార్సులు రాష్ట్రపతికి చేరతాయి. అనంతరం రాష్ట్రపతి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ దాదాపు ఏడాదిన్నరగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్ రాధాకృష్ణన్ సీజేగా రానున్న నేపథ్యంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉమ్మడి హైకోర్టులోనే న్యాయమూర్తిగా కొనసాగుతారని తెలిసింది. హైకోర్టు విభజన పూర్తయ్యాక ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశముంది. అప్పటిదాకా ఉమ్మడి హైకోర్టులోనే న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ జోసెఫ్‌ను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ 2016లోనే సుప్రీం కొలీజియం సిఫార్సు చేసినా పలు రాజకీయ కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాల్సిందిగా కొలీజియం సిఫార్సు చేసింది. ఇందు పేరుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే మహిళా న్యాయవాదుల కోటా నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తారు. వీరితో పాటు కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్యను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి అభిలాష కుమారిని మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆంటోనీ డామినిక్‌ను అదే హైకోర్టు సీజేగా సిఫార్సు చేసింది. జస్టిస్ రాధాకృష్ణన్ బయోడేటా జస్టిస్ తొట్టతిల్ బి.నాయర్ రాధాకృష్ణన్ 1959 ఏప్రిల్ 29న కేరళలో జన్మించారు. తండ్రి ఎన్.భాస్కరన్ నాయర్, తల్లి కె.పారుకుట్టి ఇద్దరూ న్యాయవాదులే. రాధాకృష్ణన్ కొల్లంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. కేరళ వర్సిటీ నుంచి బీఎస్సీ, బెంగళూరు వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తిరువనంతపురంలో పి.రామకృష్ణ పిళ్లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1988లో ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో దిట్టగా పేరు సంపాదించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2004 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండుసార్లు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. 2017 నుంచి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. -
ప్రభాస్.. ఒకేసారి రెండు సినిమాల్లో..!
బాహుబలి సినిమాతో యూనివర్సల్ స్టార్ గామారిపోయిన ప్రభాస్, ఇక మీద అభిమానులను వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాను ప్రారంభించాడు. టీజర్ కోసం కొద్ది రోజుల షూటింగ్ కూడా చేసిన యూనిట్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. ప్రభాస్ హాలీడే ట్రిప్ ముగిసిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన జిల్ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాధా కృష్ణన్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సాహోతో పాటు రాధాకృష్ణన్ సినిమా షూటింగ్ లోనూ ఒకేసారి పాల్గొనేలా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. త్వరలోనే ఈ రెండు సినిమాలపై అధికారిక ప్రకటన వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది. -
సొగశారీ..
-
నింగికెగిసిన రెండో ‘దిక్సూచి
పీఎస్ఎల్వీ సీ24 ప్రయోగం విజయవంతం కక్ష్యలోకి ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ ఉపగ్రహం సొంత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు దిశగా భారత్ శ్రీహరికోట, అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం మరోమారు విజయగర్వంతో రెపరెపలాడింది. భారత్‌కు సొంత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండో ఉపగ్రహమైన ‘ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ’ని ఇస్రో శుక్రవారం పీఎస్ఎల్వీ సీ24 ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం ఉదయం 6.44 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.శుక్రవారం సాయంత్రం 5:14 గంటలకు ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్ఎల్వీ సీ24 నింగికి దూసుకెళ్లింది. షార్‌లోని శాస్త్రవేత్తలు, వీక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఒక్కో దశను దాటుతూ ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం- ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్, షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌లు ఇతర శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హసన్‌లో గల ఇస్రో ఉపగ్ర హ నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు నియంత్రిస్తారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం ఇది 26వ సారి కాగా.. షార్ నుంచి 42వ రాకెట్ ప్రయోగం. సొంత ఉపగ్రహ దిక్సూచీ వ్యవస్థ కోసం.. ఉపగ్రహాల ద్వారా నౌకలు, విమానాల గమనాలను, వాటి భౌగోళిక స్థానాలను కచ్చితంగా తెలుసుకునేందుకు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడేలా సొంత ఉపగ్రహ దిక్సూచీ వ్యవస్థ ఏర్పాటుకు ఇస్రో కృషి చేస్తోంది. దీనికి ఏడు ఉపగ్రహాలు అవసరం కాగా.. ఇంతకుముందు ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ ఉపగ్రహాన్ని, తాజాగా రెండోదాన్నీ విజయవంతంగా ప్రయోగించింది. భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ అందుబాటులోకి వస్తే గనక.. జీపీఎస్ పరిజ్ఞానం కోసం అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. 2015లో రోదసీలోకి మన ‘హబుల్’! నక్షత్రాలు, ఖగోళ వస్తువులపై అధ్యయనం కోసం హబుల్ అంతరిక్ష టెలిస్కోపు మాదిరిగా పనిచేసే ‘ఆస్ట్రోశాట్’ మినీ టెలిస్కోపును రోదసికి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. హబుల్ 2.4 మీటర్లుండగా.. ఆస్ట్రోశాట్ 300 మి.మీ. మాత్రమే ఉంటుంది. అయినా హబుల్లో సైతం లేని విధంగా.. మూడురకాలైన కాంతికిరణాలు(అతినీలలోహిత, దృగ్గోచర, ఎక్స్ కిరణాలు)లను గుర్తించగలగడం దీని ప్రత్యేకత. వచ్చే ఏడాది దీనిని ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. - కిరణ్‌కుమార్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్ కీలక మైలురాయి: రాష్ట్రపతి పీఎస్ఎల్వీ సీ24 ప్రయోగం విజయవంతం కావడం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయి అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఇస్రోకు గవర్నర్ అభినందనలు..: పీఎస్ఎల్వీ సీ24 రాకెట్ ప్రయోగాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభినందనలు తెలిపారు. రూ. 3,425 కోట్లతో దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ... : రాధాకృష్ణన్ శాస్త్రవేత్తల సమష్టి కృషి వల్లే ప్రయోగం విజయవంతమైంది. మన దేశానికి నావిగేషన్ సిస్టం, గ్లోబల్ పొజిషన్ సిస్టంను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తెచ్చేందుకు చేసిన రెండో ప్రయోగమిది. ఈ ఏడాది ఆఖరులోపు ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ, 1డీ ఉపగ్రహాలనూ ప్రయోగిస్తాం. 2015 ఆఖరు నాటికి మరో మూడు ఉపగ్రహాలను ప్రయోగించి దిక్సూచి వ్యవస్థ సేవలను అందుబాటులోకి తెస్తాం. ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థను రూ. 3,425 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నాం. ఇందులో ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, 9 రాకె ట్లకు రూ.1,125 కోట్లు ఖర్చు చేస్తున్నాం. బెంగళూరు సమీపంలోని బైలాలు వద్ద రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మిస్తున్నాం. అలాగే రాబోయే ఐదేళ్లలో మొత్తం 60 ప్రయోగాలకు ప్రణాళికలు వేస్తున్నాం.