తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా రేపు సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణం | CP Radhakrishnan Take oath As Telangana Governor On March 20 | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా రేపు సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణం

Published Tue, Mar 19 2024 4:13 PM | Last Updated on Tue, Mar 19 2024 5:26 PM

CP Radhakrishnan Take oath As Telangana Governor On March 20 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా సీపీ రాధాకృష్ణ‌న్‌ నియామ‌క‌మైన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌.. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాత్రికి రాధాకృష్ణ‌న్ హైద‌రాబాద్‌కు చేరుకోనున్నారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా సీపీ రాధాకృష్ణ‌న్  బుధ‌వారం ఉద‌యం 11:15 గంట‌ల‌కు రాజ్‌భవన్‌లో  ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రాధాకృష్ణన్‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌నున్నారు. 

కాగా త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆ బాధ్య‌త‌ల‌ను రాధాకృష్ణ‌న్‌కు అప్ప‌గించిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ మంగళవారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు. పూర్తి స్థాయి గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే వర‌కు తెలంగాణ‌, పుదుచ్చేరి బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాల‌ని రాధాకృష్ణ‌న్‌ను కోరుతూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఓ లేఖ విడుదల చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement