తెలంగాణ మంత్రి వర్గం లోకి మరో 6 కి అవకాశం
పూర్తి స్థాయి కేబినెట్ కూర్పు పై కసరత్తు పూర్తి
ఇద్దరు బీసీ , ఓక మైనారిటీ , ఇద్దరు ఓసి ,ఓక ఎస్టీ కి అవకాశం
రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్
నిన్న గవర్నర్ తో సుదీర్ఘ సమావేశం
కేబినెట్ విస్తరణ తో పాటుగా శాఖల మార్పుకు అవకాశం
రేపు ఢిల్లీ లో పైనల్ లిస్ట్ పై కసరత్తు
కేంద్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన మరుసటి రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయం
రాజగోపాల్, సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు దాదాపు ఖరారు
ప్రేంసాగర్‌రావు, వివేక్‌లో ఒకరికి చాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో.. ఈ నెల 4న మరికొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం సోమవారం రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కావడాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ గురించి గవర్నర్‌కు రేవంత్ చెప్పారని, 4న అందుబాటులో ఉండాల్సిందిగా కోరారని తెలుస్తోంది. రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్‌గా, పుదుచ్చేరి ఇన్‌చార్జి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సైతం వ్యవహరిస్తుండడంతో ఈ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.
మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోమారు పిలుపు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళ లేదా బుధవారం వారు హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోదముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటివరకు స్పష్టత రాని ఒకట్రెండు బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరిల పేర్లు దాదాపు ఖరారయ్యాయని, ప్రేంసాగర్‌రావు, వివేక్‌లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ దఫా నాలుగు బెర్తులు భర్తీ చేస్తారని, ముస్లిం మైనారీ్టల కోసం ఒక బెర్తు, ఎస్టీల కోసం మరో బెర్తును ఖాళీగా ఉంచవచ్చని తెలుస్తోంది. ఢిల్లీలో చర్చల అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టత రానుంది.
నాలుగో వారంలో బడ్జెట్ భేటీ!
సీఎం రేవంత్‌రెడ్డి సోమ వారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో దాదాపుగా రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. కాగా సీఎం పలు అంశాలను గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతోపాటు ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన పక్షంలో 23, 24 తేదీల్లో..ఒకవేళ 23న కేంద్రం బడ్జెట్ పెట్టినట్లైతే 24 లేదా 25 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని, ఇందుకు అనుగుణంగా అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ అవుతుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment