సాక్షి,హైదరాబాద్:త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం(జనవరి8) గాంధీభవన్‌లో జరిగిన పొలిటికల్ వ్యవహారాల కమిటీ(పీఏసీ) ప్రభుత్వ కార్యక్రమాలను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మన్మోహన్‌కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు.
రేవంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
- మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేశాం
- మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది
- పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాం
- జనవరి 26 నుంచి రైతు భరోసా అందించబోతున్నాం
- వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.12వేలు అందించబోతున్నాం
- కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వబోతున్నాం
- మొదటి ఏడాదిలోనే 55143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం
- రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం
- ఏడాదిలో రూ.54వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశాం
- రూ .500 లకే సిలిండర్ ఇస్తున్నాం
- 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
- మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం
- ఇప్పటి వరకు 4000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించింది
- త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాం
- ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Comments
Please login to add a commentAdd a comment