భవితకు దిక్సూచి | Bhavita to diksuchi | Sakshi
Sakshi News home page

భవితకు దిక్సూచి

Published Tue, May 3 2016 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

భవితకు దిక్సూచి

భవితకు దిక్సూచి

ఇంటర్మీడియట్ స్పెషల్
బైపీసీ..
పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూప్‌తో ఉన్నటువంటి ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాలు మరే గ్రూపునకు లేవంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో బైపీసీతో ఉన్న ఉన్నత విద్య అవకాశాలేమిటో తెలుసుకుందాం..
 
ఎంసెట్‌తో..
ఇంటర్‌లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (బైపీసీ) చదివినవారు మన రాష్ర్టంలో మెడికల్, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ రాయొచ్చు. ఈ ర్యాంకు ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. వీటితోపాటు బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్చికల్చర్), బీఫార్మసీ, ఫార్మాడి, బీటెక్ (బయోటెక్నాలజీ) చేయొచ్చు.
 
బీఎస్సీతో కెరీర్ షైనింగ్
ఇంటర్ పూర్తయ్యాక బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనిటిక్స్, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో ఏవైనా మూడింటిని ఎంచుకొని డిగ్రీ పూర్తిచేయొచ్చు. దాదాపు అన్ని ప్రభుత్వ, కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సులు ఉన్నాయి. తర్వాత ఆసక్తి ఉన్న సబ్జెక్టులో పీజీ చేయొచ్చు. తర్వాత సీఎస్‌ఐఆర్ నిర్వహించే నెట్ రాయొచ్చు.

మంచి మార్కులు సాధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీలు/విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ చేయొచ్చు. జేఆర్‌ఎఫ్ కింద మొదటి రెండేళ్లు నెలకు రూ. 25,000 తర్వాత మూడేళ్లు నెలకు రూ. 28,000 పొందొచ్చు. పీహెచ్‌డీతో రీసెర్చ్, టీచింగ్ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరొచ్చు. పీజీ వద్దనుకుంటే సివిల్స్, ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చు.
 
 
ఉపాధికి పారామెడికల్..
రెండు తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆఫ్తల్మాలిక్ అసిస్టెంట్, ఆడియోమెట్రీ, రేడియోథెరపీ, పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్, డయాలసిస్, మెడికల్ ఇమేజింగ్, రెస్పిరేటరీ థెరపీ, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్, హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ, డెంటల్ టెక్నీషియన్, మైక్రో సర్జరీ, అనస్థీషియా, క్యాత్‌ల్యాబ్, ఈసీజీ, కార్డియాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు. ప్రారంభంలో వేతనం నెలకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది.
 
ఫిజియోథెరపి..
వ్యాయామ పరికరాలను అవసరానికి అనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపి, మాగ్నటోథెరపి, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి ఫిజియోథెరపిస్టులు అత్యవసరం. ఈ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఉంటాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేలు ఇస్తారు.
 
నర్సింగ్..
మన దేశంతోపాటు అమెరికా, పశ్చిమ ఆసియాల్లోనూ అపార ఉద్యోగ అవకాశాలను అందిస్తున్న కోర్సు. భారత్‌లో 2016 నాటికి 24 లక్షల మంది నర్సుల అవసరం ఉంటుందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అంచనా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement