రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. ఇంత వైల్డ్ ఏంట్రా బాబు! | 'The Lady Killer': Arjun Kapoor-Bhumi Pednekar romance in mystery thriller | Sakshi
Sakshi News home page

Bhumi Pednekar: రొమాన్స్‌తో రెచ్చిపోయిన భూమి.. ఆసక్తిగా ట్రైలర్!

Published Sun, Oct 29 2023 7:11 PM | Last Updated on Mon, Oct 30 2023 10:35 AM

'The Lady Killer': Arjun Kapoor-Bhumi Pednekar romance in mystery thriller - Sakshi

ఇటీవలే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే ‍అడల్ట్ మూవీతో అలరించిన నటి భూమి ఫడ్నేకర్‌. తాజాగా అర్జున్ కపూర్ సరసన ది లేడీ కిల్లర్  అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ చూస్తే ఉద్వేగభరితమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అర్జున్, భూమి ఫడ్నేకర్ మధ్య శృంగార సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. కొన్ని సీన్స్ అయితే మరింత వైల్డ్‌గా చూపించినట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అర్జున్ కపూర్‌కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ది లేడీ కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 3న థియేటర్లలోకి రానుంది.  

అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్‌ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో ప్రాజెక్ట్‌లోనూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్‌ కీలక పాత్రలో నటించనుంది. అర్జున్ చివరిసారిగా ఏక్ విలన్ రిటర్న్స్‌లో కనిపించాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో జాన్ అబ్రహం, తారా సుతారియా, దిశా పటాని నటించారు. మరోవైపు భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీలతో థ్యాంక్‌ యూ ఫర్ కమింగ్ అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం ఇటీవలే రిలీజైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement