
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అనుష్క 'భాగమతి' ఇప్పుడు హిందీలో రీమెక్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. హిందీ రీమెక్‌లో ప్రధాన పాత్ర పోషించిన భూమి పడ్నేకర్ తన ట్విటర్ వేదికగా సినీ ప్రమోషన్‌ను మొదలుపెట్టింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోలో.. భూమి నటన విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తోంది. ఈ సినిమా మొదటి నుంచి వివాదాల్లో ఉంది. ముందుగా ఈ సినిమా టైటిల్‌గా 'దుర్గావతి' అని ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం పేరును 'దుర్గామతి' గా మార్చారు. 'మాతృకను ' రూపొందించిన డైరెక్టర్ అశోక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ' తర్వాత అక్షయ్ నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డిసెంబరు 11న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కానుంది. తెలుగులో అనుష్క నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ‘ఎవరు పడితే వారు రావడానికి ఇది పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా' అని ఆమె చెప్పే డైలాగ్స్‌కి అభిమానుల కేరింతలతో థియేటర్లు దద్దరిల్లాయి. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలవుతున్న ‘దుర్గామతి’ఇప్పుడు ప్రేక్షకులను ఎంతమేరకు అలరించనుందో వేచిచూడాలి.