Bhumi Pednekar Shares Her Beauty And Skincare Secrets - Sakshi
Sakshi News home page

Bhumi Pednekar: అందంగా కనిపించేందుకు హీరోయిన్‌ భూమి ఫడ్నేకర్‌ ఏం చేస్తుందో తెలుసా?

Published Thu, Jun 29 2023 1:00 PM | Last Updated on Fri, Jul 14 2023 4:03 PM

Bhumi Pednekar Shares Her Beauty Secret - Sakshi

హీరోయిన్‌ భూమి ఫడ్నేకర్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్‌ ఉంది. 2015లో విడుదలైన ‘దమ్ లగాగే హైసా’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ భామ తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డును అందుకుంది.

కెరీర్ ఆరంభం నుంచి రొటీన్‌ కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటూ  సోషల్‌ మెసేజ్‌లతో కూడిన కథాంశాల్ని ఎంచుకుంటోంది. టాయ్ లెట్ ఏక్ ప్రేమకథ, శుభ్ మంగల్ సావ్ ధాన్ ,లస్ట్ స్టోరీస్, బాలా, పతి పత్నీ ఔర్ వో వంటి సినిమలు భూమికి మంచికి పేరు తీసుకొచ్చాయి.

సోషల్‌ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే భూమి ఫడ్నేకర్‌ తరచూ గ్లామరస్‌ ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది. రీసెంట్‌గా తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టింది. 

► రోజూ రాత్రి పడుకునే ముందు మొహానికి విటమిన్‌ – ఇ అండ్‌ అర్గాన్‌ ఆయిల్‌ రాస్తాను. వీలైనప్పుడల్లా తేనెలో కాసింత పసుపు, కొన్ని పాలు కలిపి ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకుంటాను. మా అమ్మ చెప్పిన బ్యూటీ మంత్రం.. బాదం నూనె. అందుకే తరచుగా బాదం నూనెతో మొహానికి, చేతులకు మసాజ్‌ చేసుకుంటా అంటూ తన బ్యూటీ టిప్స్‌ను షేర్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement