భూమి పెడ్నేకర్
‘నీకు తెలియని వ్యాపారంలో పొరపాటున కూడా పెట్టుబడి పెట్టవద్దు’ ‘పెట్టుబడికి సంబంధించిన రెండు రూల్స్ ఏమిటంటే... ఒకటి నష్టం రాకుండా చూసుకోవడం. రెండోది మొదటి రూల్‌ను మరచిపోకపోవడం’ అని పెద్దాయన వారెన్ బఫెట్(ప్రసిద్ధ ఇన్వెస్టర్, అపర కుబేరుడు) చెప్పిన మాటలను ఇష్టపడే బాలీవుడ్ కథానాయిక భూమి పెడ్నేకర్ ఇన్వెస్టర్‌గా కూడా ‘రాణి’స్తోంది...
తాజాగా క్రోమ్ ఆసియా హాస్పిటాలిటీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టింది భూమి పెడ్నేకర్. ‘మంచి బ్రాండ్‌తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది’ అంటుంది భూమి. క్రోమ్ ఆసియా గ్రూప్ ‘కయా’ పేరుతో గోవాలో బోటిక్ హోటల్‌ను ప్రారంభించింది. భోజనప్రియురాలైన భూమికి ప్రయాణాలు అంటే ఇష్టం. అందుకే ఆ రంగాలకు సంబంధించిన కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది.
‘పెట్టుబడి పెట్టే ముందు లాభాల కంటే ముందు ఆ కంపెనీకి ఉన్న విశ్వసనీయత గురించి ఆలోచిస్తాను’ అంటుంది భూమి.
‘యష్ రాజ్ ఫిల్మ్స్’లో ఆరు సంవత్సరాలు అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన భూమి ‘దమ్ లగా కే హైసా’ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ తీసుకుంది. కమర్షియల్‌గా సక్సెస్ అయిన కామెడీ డ్రామా ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’తో తన కెరీర్ ఊపందుకుంది.
ఫోర్బ్స్ ఇండియా–2018 ‘30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించింది.
మూడు సంవత్సరాల క్రితం ‘క్లైమెట్ వారియర్’ క్యాంపెయిన్ మొదలుపెట్టి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేస్తోంది.
ముంబైలో జన్మించిన భూమికి మొదటి నుంచి కళలు, పర్యావరణం, వ్యాపారం అంటే ఆసక్తి.
సామాజిక, పర్యావరణ సంబంధిత అంశాలపై ఆసక్తి మాట ఎలా ఉన్నా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది ఆమె కలలలో ఒకటి. అందులో ఒక అడుగు... వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం. ఎవరో ఇచ్చిన సలహాల ఆధారంగా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌పై భూమికి మంచి అవగాహన ఉంది.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించి నిర్మాణాత్మక ఆలోచనలు ఉన్నాయి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్(వెప్) సమావేశంలో మహిళా వ్యాపారవేత్తల గురించి చేసిన ప్రసంగం భూమి పెడ్నేకర్ ఆలోచనలకు అద్దం పడుతుంది.
సామాజిక, పర్యావరణ సంబంధిత అంశాలపై ఆసక్తి మాట ఎలా ఉన్నా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది ఆమె కలలలో ఒకటి. అందులో ఒక అడుగు... వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం. ఎవరో ఇచ్చిన సలహాల ఆధారంగా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌పై భూమికి మంచి
అవగాహన
ఉంది.
Comments
Please login to add a commentAdd a comment