
కొత్త చిత్రంలో గ్రామీణ మహిళలుగా తాప్సీ, భూమీ ఫెడ్నేకర్ కనిపించనున్నారు. దానికోసం పిడికిలి బిగించారు. పిడకలు తయారు చేస్తున్నారు. షార్ప్ షూటర్స్ చంద్రో, ప్రాకాషీ తోమర్ జీవిత కథల ఆధారంగా ‘సాండ్‌కే ఆంఖ్’ అనే చిత్రం రూపొందుతోంది. తాప్సీ, భూమి ఫెడ్నేకర్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఆల్రెడీ ఈ పాత్రలో నటించడానికి ఈ ఇద్దరూ షూటింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.
ఈ సినిమా ద్వారా తుషార్ హిరానందీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. అనురాగ్ కశ్యప్, నిధి పరమార్ నిర్మాతలు. ఈ షూటింగ్‌లో భాగంగా భూమీ, తాప్సీ పిడకలు కొడుతూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ‘‘అద్భుతమైన సువాసన వస్తోంది. ఏదో రుచికరమైనది తయారవుతోన్న భావన కలుగుతోంది’’ అని క్యాప్షన్ పెట్టారామె. బాలీవుడ్‌లో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్న తాప్సీ నటిస్తున్న ఈ సినిమాపైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment