బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఎంత లావుగా ఉండేదో అందరకీ తెలిసిందే. ఆమె తన తొలి చిత్రం దమ్ లగా కే హైషా కోసం 32 కిలోలు పెరిగి ట్రోలింగ్‌కి గురయ్యింది. ఆ మూవీలో ఆమె అధిక బరువుతో ఉండే భార్య పాత్రను పోషించింది. అయితే ఆమె సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే బరువు తగ్గే ఫిట్‌నెస్ ప్రయాణంపై దృష్టిసారించింది. అయితే అనేహ్యంగా జస్ట్ 4 నెలల్లోనే మంచిగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు అందుకు తనకు ఉపకరించిన డైట్ ప్లాన్‌లు, ఫిట్‌నెస్ చిట్కాలను కూడా చెప్పుకొచ్చింది. అవేంటంటే..
భూమి ఫడ్నేకర్ ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గే క్రమాన్ని ఎంచుకుంది. తనకు ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయలేదట. నచ్చినవన్నీ మితంగా తీసుకుంటూ ఉండేది. ప్రధానంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. ఎక్కువగా గుడ్లు, మిస్సీ రోటీ, ఉప్మా, పోహా, గ్రిల్డ్ చికెన్, మల్టీ-గ్రెయిన్ రోటీలు, రాజ్‌గిరా వంటి ఫుడ్స్ తీసుకునేది. ఉదయ స్కిమ్డ్ పాల తోపాటు ముసేలి తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.
మధ్యాహ్న భోజనంలో పప్పుతో కూడిన ఆహారం తప్పక తీసుకున్నట్లు పేర్కొంది. ఇక సాయంత్రం స్నాక్స్, కప్పు గ్రీన్ టీ తోపాటు పండ్లు ఉండాల్సిందే. అలాగే బాదం, వాల్‌నట్‌లను తినేందుకు ఇష్టపడేది. రాత్రి 8.30 గంటలకు డిన్నర్ చేయడానికి ఇష్టపడేది. అయితే భోజనంలో కాల్చిన చేపలు, చికెన్, పనీర్, టోపు, ఉడికించిన కూరగాయలను తీసుకున్నట్లు వివరించింది భూమి.
వర్కౌట్‌లు..
భూమి హై ఇంటెన్సిటీ కసరత్తుల జోలికి పోలేదు. కానీ పరిగెత్తడం, ఫంక్షనల్ శిక్షణ, స్విమ్మింగ్, డ్యాన్స్, ఏరోబిక్స్, వంటి వ్యాయామాలు చేసింది. బరువు తగ్గిన తర్వాత కూడా ఫిట్‌గా ఉండేలా కార్డియో, వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్, స్ట్రెచింగ్‌లను వంటివి చేస్తూనే ఉంది.
అయితే షుగర్‌కి మాత్రం దూరంగానే ఉంది. తొందరగా బరువు తగ్గేలా అన్ని రకాల స్వీట్స్‌కి దూరంగా ఉన్నట్లు తెలిపింది భూమి. అలాగే రాత్రిపూట పిండిపదార్థాలు తీసుకోవడం తగ్గించింది. ఇక ప్రతిరోజూ కనీసం ఆరు నుంచి ఏడు లీటర్ల నీటిని కచ్చితంగా తాగేది. ఈ విధమైన డైట్ ప్లాన్‌ల తోపాటు మంచి ఆహారపు అలవాట్లతో అభిమానులే గుర్తుపట్లలేనంత స్లిమ్‌గా అందంగా మారిపోయింది భూమి.
(చదవండి: ముత్యాలతో చేసిన చీరలో షానాయ కపూర్..! ఏకంగా 'లక్ష'..!)
Comments
Please login to add a commentAdd a comment