
ఆయుష్మాన్ ఖురానా
మేగజీన్ కవర్‌పేజీ మీద మోడల్స్ కూడా బయట సాధారణంగానే కనిపిస్తారు. కానీ యువత మాత్రం ఫెయిర్‌నెస్ ధ్యాసలో పడి వృథా ప్రయాసలు పడుతున్నారు. సమాజం కూడా అలానే ట్రీట్ చేస్తుంది. అబ్బాయిల విషయానికి వస్తే.. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకీ బ్యూటీ గురించిన బోధన అంటే.. ఆయుష్మాన్ ఖురానా కొత్త బాలీవుడ్ చిత్రం స్టోరీ లైన్ ఇది.
‘విక్కీ డోనర్’, ‘అంధాథూన్’ వంటి సరికొత్త స్క్రిప్ట్స్ ఎంచుకునే ఆయుష్మాన్ మరో డిఫరెంట్ క£ý కు సంతకం చేశారట.యవ్వనంలోనే బట్టతలతో బాధపడే హీరో, చామనఛాయ రంగులో ఉండి తెల్లతెల్లగా కనిపించాలని ఉవ్విళ్లూరే హీరోయిన్ మధ్య జరిగే కథ ఇది. అమర్ కౌషిక్ అనే దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘బాలా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో ఆయుష్మాన్ సరసన భూమీ పెడ్నేకర్ నటించనున్నారు. ప్రస్తుతం ‘డ్రీమ్ గాళ్’ సినిమా చేస్తున్న ఆయుష్ వచ్చే ఏడాది ‘బాలా’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment