
భూమీ ఫడ్నేకర్
బాలీవుడ్ ‘దుర్గావతి’గా మారారు కథానాయిక భూమీ ఫడ్నేకర్. అనుష్క టైటిల్ రోల్‌లో జి. అశోక్ దర్శకత్వంలో ‘భాగమతి’ (2018) చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో ‘దుర్గావతి’గా రీమేక్ కానుంది. తెలుగులో అనుష్క చేసిన పాత్రను హిందీలో భూమీ ఫడ్నేకర్ పోషించనున్నారు.
తెలుగు ‘భాగమతి’ చిత్రాన్ని తెరకెక్కించిన జి. అశోకే హిందీ రీమేక్ ‘దుర్గావతి’కి దర్శకుడు కావడం విశేషం. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. నటుడు అక్షయ్ కుమార్, నిర్మాత భూషణ్ కుమార్ సమర్పణలో విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తారు. ‘‘దుర్గావతి’లో నటించబోతున్నానని చెప్పాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. శనివారం అధికారికంగా ప్రకటించాం. చాలా సంతోషంగా ఉంది. దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు భూమీ ఫడ్నేకర్.
Comments
Please login to add a commentAdd a comment