దుర్గా మాత ఆశీర్వాదంతో... | Bhumi Pednekar Starts Shooting for Durgavati | Sakshi
Sakshi News home page

దుర్గా మాత ఆశీర్వాదంతో...

Published Fri, Jan 24 2020 3:52 AM | Last Updated on Fri, Jan 24 2020 3:52 AM

Bhumi Pednekar Starts Shooting for Durgavati - Sakshi

ప్రారంభోత్సవంలో భూమి

‘దుర్గావతి’ ప్రయాణం మొదలైంది. భూమి ఫడ్నేకర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దుర్గావతి’. తెలుగులో హిట్‌ సాధించిన అనుష్క ‘భాగమతి’ (2018) చిత్రానికి ఇది హిందీ రీమేక్‌. అక్షయ్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో విక్రమ్‌ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భాగమతి’ చిత్రానికి దర్శకత్వం వహించిన జి. అశోకే ‘దుర్గావతి’ని తెరకెక్కిస్తుండటం విశేషం. దర్శకుడిగా హిందీలో అశోక్‌కి ఇది తొలి చిత్రం. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా భూమి ఫడ్నేకర్‌ నటిస్తోన్న ఈ చిత్రంలో మహీ గిల్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు. ‘‘దుర్గా మాత ఆశీర్వాదంతో ‘దుర్గావతి’ చిత్రీకరణ మొదలైంది. నా కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాను. టాల్‌ అండ్‌ స్ట్రాంగ్‌గా నిలబడటానికి నేను రెడీ అక్షయ్‌ సార్‌’’ అన్నారు భూమి. ‘దుర్గావతి’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement