Akshay Kumar, Radhika Madan Begin Shooting for Suriya's Soorarai Pottru Hindi Remake - Sakshi
Sakshi News home page

Soorarai Pottru Hindi Remake: సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో అక్షయ్‌, షూటింగ్ స్టార్ట్‌

Published Mon, Apr 25 2022 7:04 PM | Last Updated on Mon, Apr 25 2022 7:31 PM

Akshay Kumar Started Suriya Soorarai Pottru Movie Hindi Remake - Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన సురారై పోట్రూ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇందులో సూర్య కెప్టెన్‌ గోపీనాథ్‌ అనే వ్యాపార వేత్త పాత్రలో నటించాడు. ‘సింప్లీ ఫై’ అనే పుస్తకం ఆధారం తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య పాత్రకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉంటే కొన్ని రోజులగా ఈ మూవీ హిందీ రీమేక్‌పై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హిందీలో రీమేక్‌ చేస్తున్నట్లు తాజాగా సూర్య ట్విటర్‌ వేధికగా వెల్లడించాడు.

చదవండి: నాకెప్పటికీ ఆ స్కూల్‌ డేస్‌ అంటే అసహ్యం: షాహిద్‌ కపూర్‌

‘మరో కొత్త ఆరంభానికి మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి’ అంటూ అక్షయ్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశాడు. ఇందులో అక్షయ్‌ సరసన రాధిక మదన్‌ నటిస్తోంది. ఈ రోజు మూవీ షూటింగ్‌ ముంబైలో ప్రారంభమైంది. హీరోయిన్‌ రాధిక కొబ్బరికాయ కొడుతున్న వీడియోను అక్షయ్‌ షేర్‌ చేశాడు. ఇదే వీడియో సూర్య రీట్వీట్‌ చేశాడు. కాగా తెలుగులో ఈ సినిమా దర్శకత్వం వహించిన సుధాకొంగర హిందీ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తోంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌పై తెలుగు, తమిళంలో ఈ సినిమాను నిర్మించిన సూర్య  హిందీలో కూడా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement