
‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, బాలా, బధాయి దో’ వంటి చిత్రాలతో బాలీవుడ్ ఆడియన్స్‌ని అలరించిన హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ద్వారానే భూమి టాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నారని టాక్. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం భూమి ఫెడ్నేకర్‌ని సంప్రదించారట. ఇది కానిస్టేబుల్ పాత్ర అని, సెకండాఫ్‌లో ఈ పాత్ర వస్తుందని వినికిడి. మరి.. ఈ చిత్రంలో ఈ పాత్ర ఉందా? ఉంటే.. భూమి ఫెడ్నేకర్‌నే చేస్తారా? లేక వేరే తార సీన్లోకి వస్తారా? వెయిట్ అండ్ సీ..
Comments
Please login to add a commentAdd a comment