చాలా మందితో డేటింగ్ చేశా : హీరోయిన్ | bhumi pednekar says i have dated many guys | Sakshi
Sakshi News home page

చాలా మందితో డేటింగ్ చేశా : హీరోయిన్

Published Sun, Oct 1 2017 10:16 AM | Last Updated on Sun, Oct 1 2017 5:55 PM

Bhumi Pednekar

బాలీవుడ్ హీరోయిన్లు వార్తల్లో ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు, ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అలరిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో బాలీవుడ్ బ్యూటీ చేరింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన దమ్ లగాకే హైస్సా సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన బ్యూటీ భూమీ పెడ్నేకర్.

తొలి సినిమాలో భారీకాయంతో కనిపించిన ఈ భామ తరువాత స్లిమ్ లుక్ లోకి మారిపోయిన హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునే పనిలో ఉంది. అయితే బాలీవుడ్ కాంపిటీషన్ లో ఉండేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది భూమి. తాను మోడ్రన్ యువతినన్న భూమి, బాలీవుడ్ కి పరిచయం కాకముందు చాలా మందితో డేటింగ్ చేశానని తెలిపింది.

అంతేకాదు తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నాని, ఇంత వరకు ఏ హీరోతోనూ వరుస సినిమాలు చేయలేదు హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ వస్తున్న వార్తలని అబద్ధమని కొట్టిపడేసింది. ప్రస్తుతానికి తనూ తన వృత్తినే పెళ్లి చేసుకున్నానన్న భూమి పెడ్నేకర్, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement