బడ్జెట్‌ 18 కోట్లు.. వసూళ్లు 100 కోట్లు | Toilet Ek Prem Katha box-office collection Day 8: Akshay-Bhumi's film enters the 100-crore club | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ 18 కోట్లు.. వసూళ్లు 100 కోట్లు

Published Sun, Aug 20 2017 11:08 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

బడ్జెట్‌ 18 కోట్లు.. వసూళ్లు 100 కోట్లు

బడ్జెట్‌ 18 కోట్లు.. వసూళ్లు 100 కోట్లు

ముంబై: బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ' బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఎనిమిది రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 8 రోజుల్లో రూ.100.05 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ.18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే దానికి నాలుగింతలు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రెండో వారంలోనూ నిలకడగా వసూళ్లు రాబడుతూ నిర్మాతలు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.

మొదటి రోజు రూ. 13.10 కోట్లు, రెండో రోజు 17.10 కోట్లు, మూడో రోజు 21.25 కోట్లు, నాలుగో రోజు రూ. 12 కోట్లు, ఐదో రోజు రూ. 20 కోట్లు, ఆరో రోజు 6.50 కోట్లు, ఏడో రోజు రూ. 6.10 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 4 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇటీవల కాలంలో విడుదలైన అగ్రహీరోల సినిమాలు నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ చిత్ర విజయం బయ్యర్లకు ఊరటనిచ్చింది. ‘స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌’ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. అక్షయ్‌ కుమార్‌ సరసన భూమి పడ్నేకర్ నటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement