ఆ చిత్రానికి బిల్‌గేట్స్‌ ఫిదా అయ్యారంట..! | microsoft founder bill gates like toilet a love story bollywood movie | Sakshi
Sakshi News home page

బిల్‌గేట్స్‌ మెచ్చిన చిత్రం..

Published Wed, Dec 20 2017 11:21 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

microsoft founder bill gates like toilet a love story bollywood movie - Sakshi

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తాజా చిత్రం ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ . ఈ చిత్రంలో హీరోయిన్‌గా భూమి పెడ్నేకర్‌ నటించారు. శ్రీనారాయణ్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్‌ డ్రామాను అక్షయ్‌ నీరజ్‌ పాండేతో కలిసి నిర్మించిచారు. అయితే ఈ మూవీకి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. ఈ చిత్రం ఇండియన్స్‌నే కాదు మెక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను సైతం అకట్టుకుంది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ పోస్టు చేశాడు.

‘టాయ్ లెట్‌’ సినిమా నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. అంతేకాక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపి ప్రజలను మేల్కొనేలా చేశారు. భారత దేశంలో ఉన్న పారిశుద్ద్య సవాల గురించి  ఈ సినిమాతో ప్రేక్షకులకు తెలిపారు.’ అని తన ట్విట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ భారత్‌ నేపథ్యంలో భాగంగా భారత్‌లో టాయ్‌లెట్‌ నిర్మాణం ఒక వార్త అంశంగా మారిపోవటం మనకు తెలుసు. ‍ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement