హాస్పిటల్స్ లో 'టాయిలెట్' ప్రదర్శన | Health Ministry has asked all government hospitals to screenToilet Movie | Sakshi
Sakshi News home page

హాస్పిటల్స్ లో 'టాయిలెట్' ప్రదర్శన

Published Thu, Sep 28 2017 10:20 AM | Last Updated on Thu, Sep 28 2017 11:13 AM

Health Ministry has asked all government hospitals to screenToilet Movie

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కు మద్ధతుగా తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈసినిమా ఘనవిజయం సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గాంధీ జయంతి రోజున ఈ సినిమాను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బహిరంగ మల మూత్ర విసర్జన వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. అందులో భాగంగానే టాయిలెట్ సినిమాను హాస్పిటల్స్ లో ప్రదర్శించాలని నిర్ణయించారు. అంతేకాదు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement