Elon Musk Offered $5K To College Student To Remove A Bot Tracking His Flights - Sakshi
Sakshi News home page

Elon Musk: కాలేజీ స్టూడెంట్​తో డీల్​ కోసం యత్నం.. ‘కక్కుర్తి’ ఎందుకంటూ ఎలన్​ని తిట్టిపోస్తున్నారే!

Published Fri, Jan 28 2022 4:11 PM | Last Updated on Fri, Jan 28 2022 7:46 PM

Elon Musk Try To Reach Teenager Over His Private Jet Tracking Row - Sakshi

ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన నెంబర్​ వన్​. అలాంటి వ్యక్తికి 37 లక్షలు ఒక లెక్కా? అనే సందేహం చాలామందికే కలుగుతోంది ఇప్పుడు. ఓ కాలేజీ స్టూడెంట్​తో ఒప్పందం కోసం ప్రయత్నించిన ఎలన్​ మస్క్​.. తీరా ఆ కుర్రాడు ఎక్కువ డిమాండ్​ చేసేసరికి మౌనంగా ఉండిపోయాడట. ఇంతకీ ఏమా కథ తెలుసుకోవాలని ఉందా?

వ్యక్తిగత భద్రత దృష్ట్యా తన ప్రైవేట్​ జెట్​ను ట్రాక్​ చేయడం ఆపాలంటూ ఓ టీనేజర్​తో ఎలన్​ మస్క్​ ఒప్పందం కోసం ప్రయత్నించిన వ్యవహారం ఇప్పుడు బయటకు పొక్కింది. 19 ఏళ్ల జాక్​ స్వీన్​ అనే స్టూడెంట్​.. ఎలన్​ మస్క్ ప్రైవేట్​ జెట్​​తో పాటు కొందరు ప్రముఖుల ప్రైవేట్​ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్​ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో ఎలన్​ మస్క్​ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు.

‘ఎలన్​ మస్క్​స్​ జెట్’​ పేరుతో నిర్వహించే ట్విటర్​ అకౌంట్​కు స్వయంగా ఎలన్​ మస్క్​ సందేశాలు పంపాడు. కిందటి ఏడాది ఈ ట్విటర్​ ఎక్స్​ఛేంజ్​ జరిగినట్లు తెలుస్తోంది.తన ప్రైవేట్​ జెట్​ను ట్రాక్​ చేయడం ఆపేస్తే 5 వేల డాలర్లను ఇస్తానని (మన కరెన్సీలో 3 లక్షల 75 వేల రూపాయలకు పైనే) ఎలన్​ మస్క్​, స్వీన్​కు ఆఫర్​ చేశాడట. అయితే అది తక్కువని,  బదులులుగా 50 వేల డాలర్లు ఇవ్వమని(37 లక్షల 55 వేలు) స్వీన్​ మస్క్​తో అన్నాడట. తద్వారా తన స్కూల్​ ఫీజులతో పాటు టెస్లా కారు కొనాలన్న (టెస్లా మోడల్​ 3) కూడా నెరవేరుతుందని స్వీనే ఎలన్​ మస్క్​కి బదులిచ్చాడట. కానీ, అది పెద్ద మొత్తం అని చెబుతూ ఎలన్​ మస్క్​ ఆ బేరాన్ని అక్కడితోనే ఆపేసి.. మళ్లీ మెసేజ్​ చేయలేదట.


ట్విటర్​లో ఈ ఎలన్​ మస్క్​తో జరిగిన సంభాషణను ఓ ఇంటర్నేషనల్​ మీడియా హౌజ్​ ద్వారా బయటపెట్టాడు స్వీన్​. దీంతో భద్రత కన్నా డబ్బులు ముఖ్యమా? అని ఎలన్​ మస్క్​కు తిట్టిపోస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు ‘ఎలన్​జెట్’(ట్విటర్​ హ్యాండిల్​)సహా మొత్తం 15 ఫ్లైట్​ ట్రాకింగ్​ అకౌంట్లను ఆ కుర్రాడు రన్​ చేస్తున్నాడు. వీళ్లలో బిల్​గేట్స్​, జెఫ్​బెజోస్​లాంటి వాళ్లు సైతం ఉండగా.. మస్క్​ అకౌంట్​కే ఎక్కుమంది ఫాలోవర్స్​ ఉన్నారు. మస్క్​ తనతో బేరానికి రావడం సంతోషంగా, కొంచెం ఎగ్జయిటింగ్​గా ఉందని, భవిష్యత్తులో టెస్లాగానీ, స్పేస్​ఎక్స్​తోగానీ పని చేసే అవకాశం ఆశిస్తున్నట్లు చెప్తున్నాడు 19 ఏళ్ల స్వీనే.

చదవండి: అయ్యా ఎలన్‌ మస్క్‌.. మన దగ్గర బేరాల్లేవమ్మా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement