ఢిల్లీ : కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల ఎవరూ ఎక్కడికి కదల్లేని పరిస్థితిగా మారింది. దాదాపు రెండు నెలల నుంచి ఎటువంటి సాధారణ ప్రయాణాలు లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. కొందరు తమ ఇంట్లో వాళ్లను మిస్ అవుతున్నామనే భావన వ్యక్తం చేసేవారు. అయితే వీరిలో కొందరు మాత్రం కుటుంబసభ్యులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో వారి పెంపుడు జంతువులకు అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ వల్ల కొందరు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉన్నారు. తమ ఆప్తులుగా భావించే పెట్స్ వద్దకు ఎలాగైనా చేరుకోవాలన్న తపనతో ఉన్నారు.(ఇటలీపై కరోనా పంజా.. మెడికల్ చీఫ్ కీలక వ్యాఖ్యలు)
కేవలం ఇలాంటి వాళ్ల కోసం ఓ ప్రైవేట్ జెట్ సంస్థ.. ప్రత్యేకంగా ఒక విమానాన్ని నడుపుతున్నది. అక్రిషన్ ఏవియేషన్ అనే ప్రైవేటు విమాన సంస్థ ఈ విమానాన్ని నడుపుతున్నది. ఆ విమానంలో మొత్తం ఆరు సీట్లు ఉంటాయి. ఒక్కొక్కొ సీటులో ఒక్కొక్క పెంపుడు జంతువుకు కేటాయించారు. ఆ విమానం కిరాయి ఖరీదు మొత్తం 9 లక్షల 60 వేలు కాగా, ఒక్కో సీటు ధర రూ. లక్షా 60వేలుగా ఉంది. ఇప్పటికే విమానంలోని నాలుగు సీట్లు బుక్ అవ్వగా... ఇంకా రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. జూన్ నెలలోనే ఈ ప్లేన్‌ను నడపనున్నారు. కాగా సీట్లు బుక్ చేసుకున్న వాటిలో రెండు షిహూ తుజస్, ఓ గోల్డెన్ రిట్రీవర్ శునకాలు ఉన్నాయి. మరో లేడీ ఫిజంట్ పక్షి కోసం కూడా ఒక సీటు బుక్కైంది. త్వరలోనే మిగతా రెండు సీట్లను కూడా బుక్ చేయాలని సంస్థ భావించింది.
ఢిల్లీ నుంచి ముంబై వరకు కేవలం పెంపుడు జంతువుల కోసమే ఈ విమానాన్ని నడుపుతున్నట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకురాలు దీపికా సింగ్ తెలిపారు.ఆమె మాట్లాడుతూ..' కొంతమంది వారి పెంపుడు జంతువులను తమతో పాటు విమానంలో తీసుకెళ్లేందుకు ఇష్టపడతారు. మిగతావారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండేవారు. లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాను. ఇందులో అన్ని రకాల పెంపుడు జంతువులు(పక్షులు, పెట్ డాగ్స్) వంటివి వారి యజమానుల వద్దకు క్షేమంగా పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అక్రిషన్ ఏవియేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నా.' అంటూ పేర్కొన్నారు.(ఏపీలో మరో 50 పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment