ప్రైవేట్ జెట్ అంటే విలాసవంతమైన విమానం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలకు రూ.కోట్ల ఖరీదైన ప్రైవేట్ జెట్ విమానాలు ఉంటాయి. అందులో వారు ఏకాంతంగా ప్రయాణిస్తుంటారు. అలాంటి అనుభూతి ఓ సాధారణ ప్రయాణికుడికి రూ.13వేలకే దక్కింది. అయితే అది ప్రైవేట్ జెట్ కాదు కానీ ఓ విమానానికి అంతటికీ అతనొక్కడే ప్రయాణికుడు.
(Mahindra Thar: మహీంద్రా థార్ కావాలంటే మరో రూ.లక్ష కావాలి!)
న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం... యూకేకు చెందిన 65 ఏళ్ల పాల్ విల్కిన్సన్ ఉత్తర ఐర్లాండ్ నుంచి తన కుటుంబాన్ని కలవడానికి పోర్చుగల్‌కు బయలుదేరాడు. విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పాల్‌కు గేట్ వద్ద ప్రయాణికులు ఎవరూ కనిపించలేదు. దీంతో విమానం రద్దయిందేమో అనుకుని ఆరా తీయగా మొత్తం విమానానికి తాను ఒక్కడినే ప్రయాణికుడని తెలిసింది.
(ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్‌లో ఉత్పత్తి)
ఎయిర్‌పోర్ట్, విమాన సిబ్బంది విల్కిన్సన్‌ను వీఐపీ అతిథి, కింగ్ పాల్ అంటూ సంబోధిస్తూ విమానంలోకి స్వాగతం పలికారు. విల్కిన్సన్ విమానంలో తనకు నచ్చిన సీటు ఎంచుకుని కూర్చుని ప్రైవేట్ జెట్ లాంటి ప్రయాణాన్ని ఆస్వాదించారు. ఈ ప్రయాణానికి అతనికి అయిన ఖర్చు కేవలం 162 డాలర్లు (సుమారు రూ. 13,000) మాత్రమే.
(New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!)
Comments
Please login to add a commentAdd a comment