
ఇస్లామాబాద్ : ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో తిరిగి న్యూయార్క్‌లోనే అత్యవసరంగా ల్యాండ్ అయ్యారు. అయితే తాజాగా అసలు కారణం విమాన సాంకేతికలోపం కాదని తేలింది. కాగా ఈ వ్యవహారంపై సౌదీ యువరాజు మహ్మద్‌బిన్ సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ పత్రిక ప్రైడే టైమ్స్ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లడానికి ముందు ఇమ్రాన్ రెండు రోజులు సౌదీ అరేబియాలో పర్యటించారు. తమ దేశానికి అతిథిగా వచ్చిన ఇమ్రాన్‌ను కమర్షియల్ విమానంలో పంపడం ఇష్టం లేక యువరాజు సల్మాన్ తన ప్రైవేట్ జెట్‌ను ఇచ్చారు. దీంతో ఇమ్రాన్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందం ప్రైవేట్ జెట్‌లోనే అమెరికా పర్యటనకు వెళ్లారు. సమవేశాలు ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో జెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి న్యూయార్క్ వెళ్లి అక్కడి నుంచి కమర్షియల్ ప్లైట్‌లో ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు.
అయితే దీనిపై పాకిస్తాన్‌కు చెందిన ప్రైడేటైమ్స్ పత్రిక మాత్రం ఈ వాదనతో పూర్తిగా విభేదించింది.పాక్ ప్రధాని ఇమ్రాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్‌తో కలిసి ఇస్లామిక్ దేశాల వాదనను వినిపించాలనుకోవడం సౌదీ యువరాజుకు నచ్చలేదని పేర్కొంది. పైగా తన అనుమతి లేకుండా ఇరాన్‌తో చర్చలు జరపడంపై సౌదీ యువరాజు గుర్రుగా ఉన్నట్లు ఫ్రైడే టైమ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో సల్మాన్ తన విమానాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఇమ్రాన్‌పై అసంతృస్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment