అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కాలిఫోర్నియా పొలాల్లో ఓ ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలిపోయింది.ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రివర్‌సైడ్ కౌంటీ షెరీఫ్ అధికారుల వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్‌వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలియింది.
లాస్ వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ముర్రిటాలోని ఫ్రెంచ్ వ్యాలీ విమానాశ్రయం సమీపంలో కూలిపోవడంతో ఆరుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. సెస్నా సీ550 బిజినెస్ జెట్ మంటల్లో చిక్కుకున్నట్లు రివర్‌సైడ్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. దీంతో బిగైల్ టెల్లెజ్-వర్గాస్(33) రైస్ లెండర్స్(25) మాన్యువల్ వర్గాస్-రెగాలాడో(32) లిండ్సే గ్లీచే(31) అల్మా రజిక్ (51) , ఇబ్రహెం రజిక్(46) సజీవ దహనమైపోయారు.
పైలట్ ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ విధానాన్ని ప్రయత్నించిన తర్వాత విమానం రన్‌వేకు 500 అడుగుల దూరంలో కూలిపోయిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఇదే ప్రాంతంలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం జరగడం ఆందోళన రేపింది.
Comments
Please login to add a commentAdd a comment