
బిలియనీర్ ఎలన్ మస్క్‌కు 20ఏళ్ల కుర్రాడు బంపరాఫర్ ఇచ్చాడు. ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేయకుండా ఉండాలంటే తాను విధించిన షరతుకు మస్క్ లోబడి ఉండాలని స్పష్టం చేశాడు. అమెరికా ఒర్లాండోలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ విద్యార్ధి 20 ఏళ్ల జాక్ స్వీన్.. ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్‌తో పాటు టామ్ క్రూజ్, బిల్ గేట్స్, కర్దాషియాన్ వంశానికి చెందిన సభ్యులు, కొందరు ప్రముఖుల ప్రైవేట్ డేటా మీద నిఘా కొనసాగిస్తున్నాడు. ఇందుకోసం ట్విటర్‌ను వేదికగా ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తన దాకా రావడంతో కిందటి ఏడాది నవంబర్‌లో ఎలన్ మస్క్ ఆ కుర్రాడితో బేరానికి దిగాడు.
ట్విటర్ అకౌంట్ ‘ఎలాన్ జెట్’ని తొలగించాలని మస్క్ 5 వేల డాలర్ల బేరం పెట్టగా.. ఆ కుర్రాడు 50 వేల డాలర్ల డిమాండ్ చేశాడు. తద్వారా తన కాలేజీ ఫీజు కట్టుకుంటానని, టెస్లా 3 మోడల్ కారు కొనుక్కుంటానని..ఇవేవీ కరెక్ట్ కాదనుకుంటే కనీసం మస్క్ కంపెనీల్లో ఇంటెర్న్‌షిప్ చేయడానికి అవకాశం ఇవ్వమని కోరాడు.
తాజాగా ఆ కుర్రాడే ఎలాన్ మస్క్‌కు మరో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, మస్క్ బోట్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే గతంలో నేను (జాక్ స్వీన్) అడిగినట్లు 55వేల డాలర్లు ఇవ్వాలి. లేదంటే మస్క్ తన ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించేందుకు నన్ను అనుమతి ఇవ్వాలి. నాతో పాటు మస్క్ కూడా ప్రయాణించాలి. అదే జరిగితే ట్రాక్ చేయడం ఆపేస్తానంటూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. జాక్ స్వీన్ ఆఫర్‌కు ఎలాన్ మస్క్ అంగీకరిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
చదవండి: భారీగా పెరిగిన ఇన్‌స్టంట్ నూడిల్స్ ధరలు, 14 ఏళ్ల తర్వాత..తొలిసారి!
Comments
Please login to add a commentAdd a comment