వర్క్‌ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్‌ | Companies Using Software To Track Remote Workers, Many Fired When Not Seen Working Near Computer - Sakshi

వర్క్‌ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్‌

Sep 1 2023 3:09 PM | Updated on Sep 1 2023 4:36 PM

Work From home Companies using software to track and many fired - Sakshi

ఇప్పటికి వర్క్‌ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌ ఒకటి వెలుగులోకి  వచ్చింది. రిమోట్ వర్క్‌ చేస్తున్న ఉద్యోగులపై కీస్ట్రోక్ మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిఘా పెట్టిన పలు  ఐటీ సంస్థలు, పని పట్ల అలసత్వం ప్రదిర్శిస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనికి సంబంధించిన తాజా రిపోర్టు ఒకటి సంచలనంగా మారింది. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ నివేదిక ప్రకారంఎంప్లాయిస్‌ మానిటరింగ్‌  టూల్స్‌,  వెబ్‌క్యామ్‌ల ద్వారా కూడా  వీరికి  పర్యవేక్షిస్తున్నారు. (వర్క్‌ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్‌ అంటున్న ఐటీ దిగ్గజం)

పలు దిగ్గజ కంపెనీలు సహా ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వర్క్‌ఫ్రం ఆఫీసు విధానానికి జైకొడుతున్నాయి. ఆఫీసులకు తిరిగి రావాల్సిందిగా అల్టిమేటం కూడా జారీ చేస్తున్నాయి. అయినా కొంతమంది మాత్రం ఉద్యోగులు,నిపుణులు మాత్రం ఇంటినుంచే పని చేస్తున్నారు. ఇలాంటి వారిపైనే సంస్థలు  ప్రత్యేక  సాఫ్ట్‌వేర్ల  ద్వారా వారిపై నిఘా పెడుతున్నట్టు తాజా రిపోర్టుల  ద్వారా తెలుస్తోంది. (మరో గుడ్‌ న్యూస్‌: భారీగా తగ్గిన గ్యాస్‌ ధర)

ఎంప్లాయీస్‌ మానిటరింగ్‌ టూల్స్‌తో నిఘా
సాఫ్ట్‌వేర్ కీస్ట్రోక్‌లు, మౌస్ కదలికలతో సహా వివిధ రకాల కదలికలను కూడా ఈ సాఫ్ట్‌వేరు కనిపెడుతుందట. దీని ద్వారా  రిమోట్ కార్మికులపై కన్ను వేసి ఉంచుతున్న కంపెనీలు, తేడా వేస్తే మాత్రం తీసివేయడానికి వెనుకాడటం లేదు. ఎంప్లాయిస్‌ మానిటరింగ్‌  టూల్స్‌ ద్వారా వారిని  ట్రాక్ చేస్తున్న కంపెనీలు ప‌ని వేళ‌ల్లో వారు కంప్యూటర్ల‌కు దూరంగా ఉన్న‌ట్టు వెల్ల‌డైతే మాత్రం  ఆయా  ఉద్యోగుల‌పై వేటు వేస్తున్నాయి. (OCCRP సంచలన ఆరోపణలు: వేదాంతకు భారీ ఎదురుదెబ్బ)

ఈ క్రమంలోనే ఇటీవ‌ల ఆస్ట్రేలియాకు చెందిన ఒక  మ‌హిళా ఉద్యోగి దొరికిపోయింది. ఆమె ల్యాప్‌టాప్‌లో కీస్ట్రోక్ యాక్టివిటీ తక్కువగా ఉందని గుర్తించింది. మూడు నెల‌ల పాటు త‌న ల్యాప్‌టాప్‌పై స‌రైన యాక్టివిటీ చేప‌ట్ట‌లేద‌ని గుర్తించిన కంపెనీ  ఆమెను కన్సల్టెంట్ ఉద్యోగంనుంచి తొలగించింది. గంటకు 500 కీస్ట్రోక్‌లు అవసరమని, అయితే ఆమె సగటు 100 కంటే తక్కువగా ఉందని కంపెనీ తెలిపింది.

మౌస్-మూవింగ్ టెక్నాలజీ

మరోవైపు మౌస్-మూవింగ్ టెక్నాలజీతో వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న కిలాడీ ఉద్యోగులు కూడా ఉన్నారు.  ఈ క్రమంలో ఇద్దరు ఉద్యోగులను తొలగించినట్టు మైఖేల్ పాట్రన్ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇందుకోసం టైమ్ డాక్టర్‌ అనే రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌లు, ప్రోగ్రెస్ రిపోర్ట్‌లను అందించే సాఫ్ట్‌వేర్‌ను వాడినట్టు తెలిపారు. ఇది ఉద్యోగులను స్క్రీన్ రికార్డ్ చేసి, లాగ్‌లను తనిఖీ చేసినట్లు ఆయన చెప్పారు.

ఉద్యోగుల గోప్యతపై ఆందోళన
చాలా కంపెనీలు ఇలాంటి  నిఘానే పెడుతున్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు, కొన్ని కంపెనీలు మౌస్ క్లిక్‌లను ట్రాక్ చేస్తాయి లేదా కార్మికులు తమ కంప్యూటర్‌ల వద్ద ఉన్నారని నిర్ధారించుకోవడానికి వెబ్‌క్యామ్ ఫోటోలను ఉపయోగిస్తాయి. ది న్యూయార్క్ టైమ్స్ ఇటీవలి నివేదిక ప్రకారం 10 అతిపెద్ద  అమెరికా ప్రైవేట్ కంపెనీలలో ఎనిమిది తమ ఉద్యోగుల ఉత్పాదకతను ట్రాక్ చేస్తున్నాయి. ఈ ధోరణి ఉద్యోగి గోప్యత , నిఘా గురించి ఆందోళనలను పెంచుతోంది. కొంతమంది విమర్శకులు ఈ పద్ధతులు హాని కరమని,  కార్మికులలో ఒత్తిడి మరియు ఆందోళనకు దారితీస్తుందని వాదించారు. అయితే దీనికి విరుద్ధంగా, ఇతరులు ఉద్యోగుల పర్యవేక్షణ నిర్వాహకులకు విలువైన సాధనంగా ఉంటుందని వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement