sacking
-
వర్క్ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్
ఇప్పటికి వర్క్‌ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. రిమోట్ వర్క్ చేస్తున్న ఉద్యోగులపై కీస్ట్రోక్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ద్వారా నిఘా పెట్టిన పలు ఐటీ సంస్థలు, పని పట్ల అలసత్వం ప్రదిర్శిస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనికి సంబంధించిన తాజా రిపోర్టు ఒకటి సంచలనంగా మారింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారంఎంప్లాయిస్ మానిటరింగ్ టూల్స్, వెబ్‌క్యామ్‌ల ద్వారా కూడా వీరికి పర్యవేక్షిస్తున్నారు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) పలు దిగ్గజ కంపెనీలు సహా ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వర్క్‌ఫ్రం ఆఫీసు విధానానికి జైకొడుతున్నాయి. ఆఫీసులకు తిరిగి రావాల్సిందిగా అల్టిమేటం కూడా జారీ చేస్తున్నాయి. అయినా కొంతమంది మాత్రం ఉద్యోగులు,నిపుణులు మాత్రం ఇంటినుంచే పని చేస్తున్నారు. ఇలాంటి వారిపైనే సంస్థలు ప్రత్యేక సాఫ్ట్వేర్ల ద్వారా వారిపై నిఘా పెడుతున్నట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. (మరో గుడ్ న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ ధర) ఎంప్లాయీస్ మానిటరింగ్ టూల్స్‌తో నిఘా సాఫ్ట్వేర్ కీస్ట్రోక్‌లు, మౌస్ కదలికలతో సహా వివిధ రకాల కదలికలను కూడా ఈ సాఫ్ట్వేరు కనిపెడుతుందట. దీని ద్వారా రిమోట్ కార్మికులపై కన్ను వేసి ఉంచుతున్న కంపెనీలు, తేడా వేస్తే మాత్రం తీసివేయడానికి వెనుకాడటం లేదు. ఎంప్లాయిస్ మానిటరింగ్ టూల్స్ ద్వారా వారిని ట్రాక్ చేస్తున్న కంపెనీలు పని వేళల్లో వారు కంప్యూటర్లకు దూరంగా ఉన్నట్టు వెల్లడైతే మాత్రం ఆయా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. (OCCRP సంచలన ఆరోపణలు: వేదాంతకు భారీ ఎదురుదెబ్బ) ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళా ఉద్యోగి దొరికిపోయింది. ఆమె ల్యాప్‌టాప్‌లో కీస్ట్రోక్ యాక్టివిటీ తక్కువగా ఉందని గుర్తించింది. మూడు నెలల పాటు తన ల్యాప్‌టాప్‌పై సరైన యాక్టివిటీ చేపట్టలేదని గుర్తించిన కంపెనీ ఆమెను కన్సల్టెంట్ ఉద్యోగంనుంచి తొలగించింది. గంటకు 500 కీస్ట్రోక్‌లు అవసరమని, అయితే ఆమె సగటు 100 కంటే తక్కువగా ఉందని కంపెనీ తెలిపింది. మౌస్-మూవింగ్ టెక్నాలజీ మరోవైపు మౌస్-మూవింగ్ టెక్నాలజీతో వర్క్ ఫ్రం హోం విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న కిలాడీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఉద్యోగులను తొలగించినట్టు మైఖేల్ పాట్రన్ ట్విటర్లో షేర్ చేశారు. ఇందుకోసం టైమ్ డాక్టర్ అనే రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌లు, ప్రోగ్రెస్ రిపోర్ట్‌లను అందించే సాఫ్ట్‌వేర్‌ను వాడినట్టు తెలిపారు. ఇది ఉద్యోగులను స్క్రీన్ రికార్డ్ చేసి, లాగ్లను తనిఖీ చేసినట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల గోప్యతపై ఆందోళన చాలా కంపెనీలు ఇలాంటి నిఘానే పెడుతున్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు, కొన్ని కంపెనీలు మౌస్ క్లిక్‌లను ట్రాక్ చేస్తాయి లేదా కార్మికులు తమ కంప్యూటర్ల వద్ద ఉన్నారని నిర్ధారించుకోవడానికి వెబ్‌క్యామ్ ఫోటోలను ఉపయోగిస్తాయి. ది న్యూయార్క్ టైమ్స్ ఇటీవలి నివేదిక ప్రకారం 10 అతిపెద్ద అమెరికా ప్రైవేట్ కంపెనీలలో ఎనిమిది తమ ఉద్యోగుల ఉత్పాదకతను ట్రాక్ చేస్తున్నాయి. ఈ ధోరణి ఉద్యోగి గోప్యత , నిఘా గురించి ఆందోళనలను పెంచుతోంది. కొంతమంది విమర్శకులు ఈ పద్ధతులు హాని కరమని, కార్మికులలో ఒత్తిడి మరియు ఆందోళనకు దారితీస్తుందని వాదించారు. అయితే దీనికి విరుద్ధంగా, ఇతరులు ఉద్యోగుల పర్యవేక్షణ నిర్వాహకులకు విలువైన సాధనంగా ఉంటుందని వాదించారు. -
కాగ్నిజెంట్‌పై పోరుకు సై అన్న ఉద్యోగులు
చెన్నై: భారీగా ఉద్యోగుల తొలగింపులపై ఐటీ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఐటీసేవల సంస్థ కాగ్నిజెంట్ సీనియర్ స్థాయి టెకీలపై వేటు వేస్తున్న నేపథ్యంలో రెండు గ్రూపులు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఫోరమ్ ఆఫ్ ఐటి ఎంప్లాయీస్ (ఫైట్), ఎన్డీఎల్ఎఫ్ ఐటి ఉద్యోగుల వింగ్ ఈ తొలగింపులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాయి. పెర్ఫామెన్స్ఆధారంగా కాగ్నిజెంట్ ఉద్యోగులపై వేటు వేస్తున్న ధోరణినుంచి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రయోజనాలను కాపాడాలంటూ రాష్ట్ర కార్మికశాఖ వద్ద ఈ పిటిషన్ దాఖలు చేశాయి. అయితే పెర్ఫామెన్స్ ఆధారంగా ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ఆరోపణలను కాగ్నిజెంట్ తిరస్కరించింది. తక్కువ నైపుణ్య ప్రదర్శన కారణంగా ఉద్యోగులే కొంతమంది సంస్థను వీడుతున్నట్టు ప్రకటించింది. "కాగ్నిజెంట్ ఏ తొలగింపులను నిర్వహించలేదు. ప్రతి సంవత్సరం, మా పరిశ్రమ అంతటా ఉత్తమ సాధనంగా, మేము క్లయింట్ అవసరాలను తీర్చడానికి , మా వ్యాపార లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉద్యోగి నైపుణ్యం ఉన్నట్లు నిర్ధారించడానికి మేము ఒక సమీక్షను నిర్వహిస్తాం. ఈ ప్రక్రియ కంపెనీల నుంచి మార్పు చెందుతున్న కొంతమంది ఉద్యోగులతో సహా మార్పులకు దారితీస్తుంది "అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. న్యూ డెమోక్రటిక్ లేబర్ ఫ్రంట్ (ఎన్డీఎల్ఎఫ్) కు అనుబంధంగా పనిచేస్తున్న ఎన్డీఎల్ఎఫ్ ఐటి ఎంప్లాయీస్ వింగ్, ఇతర రాష్ట్రాల్లో యూనియన్లను స్థాపించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వివిధ కంపెనీల నుంచి దాదాపు 100 ఫిర్యాదులు అందుతున్నాయని ఆరోపించింది. ఉద్యోగుల అక్రమ తొలగింపులపై ఆయా రాష్ట్రాల కార్మిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తమ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి రాష్ట్రంలో యూనియన్ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని అని యూనియన్‌కు చెందిన కుమార్ ఎస్ అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్డిఎల్ఎఫ్ ఐటి ఉద్యోగుల విభాగం ఉందని కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణాలకు విస్తరణ ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. -
ఒక్క నిమిషంలో అంతా జరిగిపోయింది..
-
ఒక్క నిమిషంలో అంతా జరిగిపోయింది..
ముంబై: టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత జీఈసీ సభ్యుడు ప్రొఫెసర్ నిర్మల్య కుమార్ (56) తొలిసారిగా స్పందించారు. టాటా సన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదవీచ్యుతుడైన ఆయన తన మనోభావాలను "ఐ జస్ట్ గాట్ ఫైర్డ్ " అనే పేరుతో వ్యక్తిగత వెబ్సైట్ (బ్లాగ్) లో పోస్ట్ చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కుమార్ ముందస్తు సమాచారం ఏమీ లేకుండానే అంతా ఒక నిమిషంలో ముగిసిందని వాపోయారు. కేవలం తాను మిస్త్రీకి సన్నిహితుడిననే కారణంగానే ఈ పరిణామం సంభవించిందని పేర్కొన్నారు. ఎంతపెద్ద సంస్థకు వెళితే మానవ విలువలు అంతగా క్షీణిస్తాయంటూ ఫిలాసఫీ చెప్పుకొచ్చారు. అక్టోబర్ 31 తన జీవితంలో ఒక వింతైన రోజని తన పోస్ట్ లో కుమార్ పేర్కొన్నారు. తనకు ఎంతో సన్నిహితుడు, తరచూ తన వాదనలు బలపరిచే వ్యక్తినుంచి ఇక రేపటి నుంచి విధులకు రావాల్సిన అవసరం లేదనే సమాచారం అందుకోవడం విచారకరమన్నారు. అంతే. ఒక్క నిమిషంలో అంతా జరిగిపోయింది. "ఐ జస్ట్ గాట్ ఫైర్డ్ " అంటూ తనపై వేటు పడిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. కంపెనీనుంచి ఒకసారి తొలగించిన తరువాత మన నిజమైన స్నేహితులు ఎవరో మనకు తెలుస్తుందన్న కుమార్ కానీ తనను గౌరవించిన, ఆప్యాయంగా ఆదరించిన వారిని వీడడం విచారకరమని, వారి హృదయపూర్వక చిరునవ్వులు ఎల్లపుడూ తనతో ఉంటాయన్నారు. ముగ్గురు తప్ప తనతో మూడేళ్లపాటు కలిసి పనిచేసిన సీఈవోలు, ఇతర ఉన్నత అధికారులు మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అంతేకాదు కార్పొరేట్ ప్రపంచంలో ఇదంతా మామూలేనని,కానీ ఎవరూ ఇలాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండరన్నారు. అలాగే 18 సం.రాల వయసు వచ్చిన తరువాత మొదిటిసారి తాను ప్రస్తుతం నిరుద్యోగిగా నిలబడ్డానన్నారు. ఇది టాటాల అమర్యాదకరమైన చర్య తప్ప సంస్థలో 670,000 మంది ఉద్యోగుల తప్పేమీ లేదన్నారు. కేవలం సైరస్ మిస్త్రీతో సన్నిహితం, విస్తృతంగా మెలగడమే దీనికి కారణమన్నారు.