ఒక్క నిమిషంలో అంతా జరిగిపోయింది.. | My Sacking Was Over In A Minute, Says Former Tata Group's Top Official Nirmalya Kumar | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 8 2016 8:07 AM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM

టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత జీఈసీ సభ్యుడు ప్రొఫెసర్ నిర్మల్య కుమార్ (56) తొలిసారిగా స్పందించారు. టాటా సన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదవీచ్యుతుడైన ఆయన తన మనోభావాలను "ఐ జస్ట్ గాట్ ఫైర్డ్ " అనే పేరుతో వ్యక్తిగత వెబ్సైట్ (బ్లాగ్) లో పోస్ట్ చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కుమార్ ముందస్తు సమాచారం ఏమీ లేకుండానే అంతా ఒక నిమిషంలో ముగిసిందని వాపోయారు. కేవలం తాను మిస్త్రీకి సన్నిహితుడిననే కారణంగానే ఈ పరిణామం సంభవించిందని పేర్కొన్నారు. ఎంతపెద్ద సంస్థకు వెళితే మానవ విలువలు అంతగా క్షీణిస్తాయంటూ ఫిలాసఫీ చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement