బిల్డింగ్ చుట్టూ ఉన్న ఏనుగుల కందకంలో ఫారెస్ట్ గార్డ్ రాత్రి భోజనంలో మిగిలిపోగా పారేసిన కోడి ఎముకలను పటపటా నవులుతున్నాయి ఆ రెండు పెద్ద పునుగు పిల్లులు. అవి చిన్న భారత పునుగు పిల్లుల కంటే చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి. మా శక్తివంతమైన లైట్లను మెరుగైన దృష్టికోణంతో చూడటానికి అవి మధ్య మధ్యలో వాటి వెనక కాళ్లపై నుంచుంటున్నాయి. మా అందరికి ఒకటే ఆలోచన వచ్చింది: మలబార్ పునుగు పిల్లి, ఎవరికీ అంతుచిక్కని పాలిచ్చే భారతీయ జంతువు. అవి పారిపోతాయేమోనన్న భయానికి మేము కెమెరా తీసుకు వచ్చే ప్రయత్నం చెయ్యలేదు. దానికి బదులుగా మేము చీకట్లోనే దాని లక్షణాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాము.
దెగ్గర దెగ్గర ఆరు దశాబ్దాల క్రితం హై వేవీ మౌంటెన్స్ తెయ్యాకు ఎస్టేట్లోని తెయ్యాకు రైతు అయిన ఆంగస్ హటన్ మలబార్ పునుగు పిల్లి చాలా విరివిగా కనిపించే జంతువని వ్రాసి పెట్టారు., కానీ ఆయన చిన్న భారతీయ పునుగు పిల్లిని చూసి అలా పొరపాటు పడ్డారేమో అనేది ఒక ప్రఘాడ అనుమానం. 1939 కల్లా మలబార్ పునుగు పిల్లి అరుదై, అంతరించిపోవడానికి దెగ్గరగా ఉందేమోనని జంతు శాస్త్రవేత్తలు భయపడ్డారు. మేము ఎంతో ఉత్సాహంగా, రెండు మలబార్ పునుగువ పిల్లులని చూశామని సందర్శకుల పుస్తకంలో రాశాము.
మలబార్ పునుగు పిల్లిని లోగోగా పెట్టుకున్న సెంటర్ ఫర్ వైల్డ్లైఫ్ స్టడీస్ సంస్థలో అజిత్ కుమార్ గారు మేము మలబార్ పునుగు పిల్లిని చూశామని విశ్వసించలేదు. చిన్న భారతీయ పునుగు పిల్లి ఎంతో విసతృతంగా రకరకాల నివాసాలలో, ఎత్తులలో, ఆక్షాంసాలలో, చాలా విభిన్న లక్షణాలు, శరీర ఆకృతి, పరిమాణాలు కలిగి ఉంటుందని ఆయన సూచించారు.
ఒక జీవశాస్త్రవేత్త, మేము చూసిన పునుగు పిల్లికి సింహం వంటి జూలు ఉందా అని అడిగారు. కానీ మేము అది గమనించలేదు. మెడ పొడవునా మూడు చారలూ? అటువంటిదేదో చూశామని మేము అనుకున్నాం. దాని తోక చుట్టూ కట్లు గమనించామా అని ఇంకొకరు అడిగారు. ఏమో, అప్పుడు చాలా చీకటిగా ఉంది. వాటి తోక చివర నల్లగా ఉందా? దృరదృష్టవశాత్తు ఈ లక్షణాల కోసం చూడాలని మాకు తెలియలేదు.
పాలిచ్చే చిన్న జంతువుల మీద నిపుణులైన నందిని రాజమణి మారియు దివ్య ముదప్పా, ఇంగ్లాండ్లో మారియు ఇండియాలో ఉన్న రకరకాల మ్యూసియంలలో భద్రపరచిన మలబార్ పునుగు పిల్లులకి సంబంధించిన ఆరు చార్మాలూ ఇంకా మూడు కాపలాలు పరీక్షించారు. అంతే కాక 1800లు మొదలుకుని పునుగు పిల్లుల మీద రాయబడ్డ ప్రతీదీ చదివేసారు.
నివేదిక ప్రకారం మలబార్ పునుగు పిల్లి పడమర కానుముల లోతట్టు తీరప్రాంత అడవులలోని కర్వార్, ఉత్తర కర్ణాటక నుంచి కేరళలోని త్రివేండ్రమ్ వరకూ కనిపిస్తాయి. కొద్ది సార్లు అవి తిరుణలవెలి లోపల బిలిగిరి రంగస్వామి కోవెల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోనూ, హై వేవీ కొండలంలోనూ కనిపించాయి. కానీ అవి ఎక్కువగా కోజికోడ్ చుట్టుపక్కలే కనిపించాయి. ఆసియాలో మరి ఏ పునుగు పిల్లి ఇంత పరిమిత పరిధిలో ఉండదు.
పేరుగాంచిన మలబార్ పునుగు పిల్లి యొక్క మస్క్ కోసం దాన్ని వేటడడం వల్ల అవి అరుదైపోయి ఉండడానికి అవకాశం ఉండవచ్చని నందిని, దివ్య ఒప్పుకున్నారు. కానీ, వేరే పునుగు పిల్లులు చక్కగా అభివృద్ధి చెందుతుంటే, ఈ జంతువు వాటి నివాసమైన అడవులను పొలాలుగా మారిస్తే తట్టుకోలేనంత సున్నితమైనవా?
మ్యూసియం నమూనాలా మూలం సరిగా తెలియనందువల్ల, ఇంకా పాలిచ్చే జంతువుల నిపుణుల మధ్య బేధభిప్రాయాలవల్ల, మలబార్ పునుగు పిల్లి రూపం పట్లా, లక్షణాల పట్లా నిజమైన స్పష్టత లేదు. ఇది చాలదన్నట్టు దక్షిణ ఆసియాలోని పెద్ద-చుక్కల పునుగు పిల్లులు మారియు మలబార్ పునుగు పిల్లులు దెగ్గర దెగ్గర ఒకే పోలికలతో ఉంటాయి. ఈ విషయం ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయం సూచిస్తుంది: మలబార్ పునుగు పిల్లులు ఎన్నడూ ఉనికిలోనే లేవు!
మందుల తయారిలో, సుగంధ ద్రవ్యాలా తయారిలో, ఇంకా పూజలలో ఉపయోగించే పునుగు పిల్లుల మస్క్ గ్రంధిలోని సివిటోన్ కోసం వేల ఏళ్లుగా ఇథియోపియా, దక్షిణ ఆసియా ఇంకా భారతదేశం మధ్య వ్యాపారం సాగుతోంది. ఈ రోజుకి కూడా మస్క్ తియ్యటంకోసం, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చిన్న పునుగు పిల్లులను ఫార్మ్ లో పెంచుతారు. ఈ మధ్యకాలంలో అతి ఎక్కువగా మలబార్ పునుగు పిల్లి కనిపించిన స్థలమైన కోజికోడ్ పూర్వ కాలం నుంచీ పునుగు పిల్లుల వ్యాపార కేంద్రం. దక్షిణ ఆసియా నుంచి తెచ్చిన పెద్ద-చుక్కల పునుగు పిల్లులు చెర నుంచి తప్పించుకు పారిపోవడంతో అప్పుడప్పుడు అడవిలో పునుగు పిల్లులు కనిపించడానికి అవకాశం ఇచ్చివుంటుందా అని నందిని, దివ్య ఆలోచించారు. ఇదేమంత అసంభవం కాదు, ఎందుకంటే చిన్న భారత పునుగు పిల్లులు తప్పించుకుని మాడగాస్కర్, ఫిలిప్పీన్స్ మారియు ఇతర దక్షిణ ఆసియా దీవులలో వాటినవి స్థాపించుకున్నాయి. అందువల్ల మలబార్ పునుగు పిల్లి, పెద్ద- చుక్కల పునుగు పిల్లి కంటే పెద్ద ప్రత్యేకత కలిగిందేమి కాకపోవచ్చు అనడానికి ఎంతో అవకాశం ఉండీ. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో జన్యు పరీక్ష ఇంకొక ముందంజ వేస్తుంది. అసల మలబార్ పునుగు పిల్లులు నిజమైనవేనా? కానీ పురాతన నమూనాల నుంచి తీసిన డిఎన్ఏ మరీ సిధిలం అయిపొయింది. అందువల్ల మలబార్ పునుగు పిల్లిని గురించిన పొడుపు కథ ఇంకా వీడలేదు.
Author: జానకి లెనిన్
Translator: రోహిణి చింతా
Comments
Please login to add a commentAdd a comment