Civet Cat
-
విజయవాడలో అరుదైన పిల్లి హల్చల్.. ఎలా వచ్చింది?
సాక్షి,విజయవాడ( కృష్ణా): తిరుమల శేషాచలం అడవుల్లో ఎక్కువగా సంచరించే పునుగు పిల్లి విజయవాడలో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పిల్లి బెజవాడ బృందావన కాలనీలోని చెట్లపై తిరుగుతుండటాన్ని స్థానికులు రెండు, మూడు రోజులుగా గమనిస్తున్నారు. మంగళవారం రాత్రి ఎ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లగా వారు తలుపులన్నీ మూసి పిల్లిని పట్టుకుని బోనులో బంధించారు. బుధవారం దానిని చూసిన స్థానికులు తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లిగా గుర్తించారు. తిరుమల నిత్యాన్నదాన కార్యక్రమానికి కూరగాయలు తరలించేందుకు అక్కడి నుంచి వాహనాలు వస్తుంటాయి. అలా వచ్చిన వాహనాల్లో ఇక్కడికి చేరి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ విషయంపై స్థానికుల సమాచారంతో వచ్చి పిల్లిని తీసుకెళ్లిన అటవీశాఖ అధికారులు దానిని అడవిలో వదిలివేయనున్నట్టు తెలిపారు. చదవండి: కోడి ఈకలు.. చేపల పొలుసుతో ఇటుకలు తయారుచేసింది -
ఏజెన్సీలో పునుగు పిల్లి ఆనవాలు
కురుపాం: అరుదుగా కనిపించే పునుగు పిల్లి ఆనవాలు కురుపాం ఏజెన్సీలో ప్రత్యక్షమయ్యాయి. అదీ కూడా ఏదో వాహనం ఆ పునుగు పిల్లిని గురువారం రాత్రి ఢీకొట్టడంతో ఆర్ఆండ్బీ రహదారిపై మృత్యువాత పడి కనిపించింది. ఈ పునుగు పిల్లులు శేషాచలం అడవుల్లో గతంలో ఎక్కువగా ఉండేవి. రానురాను అవి అంతరించి పోతున్నట్లు చెబుతున్నారు.పునుగు పిల్లి చమురుతోనే తిరుపతిలో ఉన్న వేంకటేశ్వరస్వామికి దీపారాధన చేయటం ఆనవాయితీ. ఈ పిల్లులు సంతతి కనుమరుగవుతున్న తరుణంలో టీటీడీ ఇప్పటికే పునుగు పిల్లుల సంరక్షణకు చర్యలు కూడా చేపట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో కురుపాం నియోజకవర్గం పరిధిలో ఉన్న గరుగుబిల్లి మండలం సంతోషపురం సమీపంలో ఉన్న రహదారిపై ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ పునుగు పిల్లి మృతి చెందింది. ఈ ప్రాంతంలో కూడా చినతిరుపతిగా పేరొందిన తోటపల్లి దేవస్థానం సమీపంలో ఉండటం మరో విశేషం. ఏది ఏమైనా అంతరించిపోతుందనుకుంటున్న పునుగు పిల్లి సంతతి ఇలా ప్రత్యక్షం కావడంతో ఇక వెంకన్న నైవేద్యానికి పునుగు పిల్లుల కొరత లేనట్లేనని భావిస్తున్నారు. -
వరంగల్ జిల్లాలో అరుదైన పునుగు పిల్లి
శాయంపేట: వరంగల్ జిల్లా శాయంపేట మండలం మందారి పేట సమీపంలో శుక్రవారం అరుదైన పునుగుపిల్లి కనిపించింది. మాందారిపేట సమీపంలోని సత్యనారాయణరెడ్డికి చెం దిన గొర్రెల ఫాం వద్ద వృథాగా ఉన్న పెద్ద నీటి తొట్టెలో పడింది. అక్కడ పని చేస్తున్న గౌరే నగేశ్ దానిని చూసి స్థానిక అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే, అధికారులు ఎవరూ రాలేదు. ఆ పునుగుపిల్లి సాయంత్రం తొట్టి నుంచి బయటపడి అడవిలోకి వెళ్లిపోయింది.