ఏజెన్సీలో పునుగు పిల్లి ఆనవాలు | civet cat dead in road accident agency area | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో పునుగు పిల్లి ఆనవాలు

Published Sat, Nov 11 2017 10:32 AM | Last Updated on Sat, Nov 11 2017 10:32 AM

civet cat dead in road accident agency area - Sakshi

గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన పునుగు పిల్లి

కురుపాం: అరుదుగా కనిపించే పునుగు పిల్లి ఆనవాలు కురుపాం ఏజెన్సీలో ప్రత్యక్షమయ్యాయి. అదీ కూడా ఏదో వాహనం ఆ పునుగు పిల్లిని గురువారం రాత్రి ఢీకొట్టడంతో ఆర్‌ఆండ్‌బీ రహదారిపై మృత్యువాత పడి కనిపించింది.  ఈ పునుగు పిల్లులు శేషాచలం అడవుల్లో గతంలో ఎక్కువగా ఉండేవి. రానురాను అవి అంతరించి పోతున్నట్లు చెబుతున్నారు.పునుగు పిల్లి చమురుతోనే తిరుపతిలో ఉన్న వేంకటేశ్వరస్వామికి దీపారాధన చేయటం ఆనవాయితీ. ఈ పిల్లులు సంతతి కనుమరుగవుతున్న తరుణంలో టీటీడీ ఇప్పటికే  పునుగు పిల్లుల సంరక్షణకు చర్యలు కూడా చేపట్టిన విషయం విదితమే.

ఈ క్రమంలో కురుపాం నియోజకవర్గం పరిధిలో ఉన్న గరుగుబిల్లి మండలం సంతోషపురం సమీపంలో ఉన్న రహదారిపై ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ పునుగు పిల్లి మృతి చెందింది. ఈ ప్రాంతంలో కూడా చినతిరుపతిగా పేరొందిన తోటపల్లి దేవస్థానం సమీపంలో ఉండటం మరో విశేషం. ఏది ఏమైనా అంతరించిపోతుందనుకుంటున్న పునుగు పిల్లి సంతతి ఇలా ప్రత్యక్షం కావడంతో ఇక వెంకన్న నైవేద్యానికి పునుగు పిల్లుల కొరత లేనట్లేనని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement