అదుపులోకి రాని వాంతులు, విరేచనాలు
ఆస్పత్రి పాలవుతున్న పెద్దేముల్ ప్రజలు
పట్టించుకోని అధికారులు
పెద్దేముల్: మండలంలో వాంతులు విరేచనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరుగురు వ్యక్తులు వాంతులు, విరేచనాలకు గురై బుధవారం ఆస్పత్రి పాలయ్యారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన ఉప్పరి మాణెమ్మ (35), బ్యాగరి పార్వతమ్మ (45), నూర్జహాన్ (20), తలారి నర్సమ్మ (50), నర్కీన్ (20)తో పాటు గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ (28) వాంతులు విరేచనాలతో పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ప్రతీరోజు సుమారు ఏడెనిమిది మంది వరకు ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్నారని వైద్య సిబ్బంది తెలిపారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.