
వణికిస్తున్న అతిసార
ధారూరు: అతిసార, డయేరియా జనాన్ని వణికిస్తున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ధారూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం మూడు డయేరియా కేసులు వచ్చాయి. స్టేషన్‌ధారూరుకు చెందిన నసీమాబేగం(28), దోర్నాల్‌తండాకు చెందిన చంద్రిబాయి(40), ధారూరుకు చెదిన మంజుల(25) డయేరియాతో ఆస్పత్రిలో చేరారు. తరిగోపుల గ్రామానికి చెందిన ముగ్గురు, అంపల్లికి చెందిన ఒకరికి అతిసార సోకగా వారంతా ధారూరులో డాక్టర్ లేరంటూ వికారాబాద్, తాండూర్‌కు వెళ్లి వైద్యం చేయించుకున్నారు.